పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

131


4. యమకము :


అర్ధ భేదముగల, అక్షరముల సముదాయము (అచ్చులు - హల్లులు కూడ) మరల మరల ప్రయోగించబడిన యెడల, యమకమనబడును.

(I) ఆమనికిన్, మనికియైన, యారామమునన్.
(II) లేమా ! దనుజుల గెలువగ
     లేమా ! నీవేలకడిగి లేచితి, విటురా
     లేమాను, మానలే, నౌ
     లేమా ! విల్లందు కొమ్ము లీలంలన్.

(I) ఇచట పురము - మనికి అను అక్షరములు సమూహము, అర్ధభేదముతో మరల వాడబడుట చేత నిది యమకాలంకారము.


(II) ఇందు లేమా, అను అక్షరముల సమూహము, అర్ధభేదముతో, మరల మరల, ప్రయోగించుట చేత యమకాలంకారము.


ఛేకాను ప్రాసమునకు - యమకమునకు, భేదమేమన, యమకమున అక్షరముల సమూహము మరల మరల వచ్చుటలో వ్యవధానముండ వచ్చును. ఛేకాను ప్రాసమున నట్టి వ్యవధానము పనికిరాదు.

5, ముక్త పదగ్రస్తము :


విడిచిన, పదభాగముల, అవ్యవధానముగా, మరల గ్రహించుచు, రచింపబడిన యెడల, ముక్తపదగ్రస్తమగును. ముక్త = విడువబడిన, పద = పదమును, గ్రస్త = మరల గ్రహించుట అని అర్ధము.

సులభ వ్యాకరణము