పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

129

అలంకార విభాగము

అలంకార పరిచ్ఛేదము

హారములు మొదలగునవి, మానవునకు సౌందర్యమును కల్గించును. అట్లే గద్య -పద్యాత్మకమైన కావ్యములకు ఈ అలంకారములు సొగసు కలిగించి, ఆహ్లాదమును గూర్చును.

అలంకారములు రెండు విధములు. అవి 1) శబ్దాలంకారములు 2) అర్ధాలంకారములు.

శబ్దమాత్ర ప్రధానమైనవి శబ్దాలంకారములు. అర్ధవిశేషమును బట్టి వచ్చునవి, అర్ధాలంకారములు.

1. వృత్యను ప్రాసా లంకారము:

ఒక హల్లు, అనేక పర్యాయములు, వచ్చునట్లు రచించిన, అది వృత్యను ప్రాసా లంకారము.

ఉదా:

1) పుండరీక, షండ మండితంబు.
2) వెడవెడ, బిడిముడి, తడబడ, నడుగిడు.
3) విష్ణు, రోచిష్ణు, కృష్ణు, సహిష్ణు,కృష్ణు

మొదటి ఉదాహరణములో, బిందు పూర్వక డకారము, రెండవ దానిలో డకారము, మూడవ దానిలో 'ష్ణు'వర్ణము పలుమారులు ఆవృత్తములైనవి.

2. ఛేకానుప్రాసము:

రెండేసి హల్లులు, అర్ధభేదము కలిగి వ్యవధానము లేకుండ, ప్రయోగించబడినచో, ఛేకానుప్రాసము అందురు.

సులభ వ్యాకరణము