ఈ పుట ఆమోదించబడ్డది
127
12. అంతరాక్కర : -
పాదమునకు 1 సూర్యగణము, 2 ఇంద్రగణములు, 1 చంద్రగణముండును. 4వ గణము మొదట యతి ప్రాసముండును.
13. దండకము : -
మొదట - న - స - హ - ములలో, నొకదానిని గాని, తగణమునుగాని, కూర్చి చివరవరకు తగణములను, చివర గురువును, చేర్చవలెను. ఇష్టమైనంత వ్రాసికొనవచ్చును.
14. మంగళమహాశ్రీ : -
పాదమునకు 26 అక్షరములు. 9 - 17 వర్ణములు యతులు. భ - జ - స - న - భ - జ - స - న - గ - గ ములుండును.
వృత్తములమార్పు :
ఉత్పలమాల యందలి, మొదటిగురువును, రెండు లఘువులుగా, మార్చినచో చంపకమాల యగును.
చంపకమాల యందలి, మొదటి రెండు లఘువులను ఒక గురువుగా మార్చిన అది ఉత్పలమాల యగును.
శార్దూలమందలి, మొదటిగురువును రెండు లఘువులుగా, మార్చిన అది మత్తేభమగును.
సులభ వ్యాకరణము