ఈ పుట ఆమోదించబడ్డది
120
ఉదా :
న | జ | భ | జ | జ | జ | ర |
ǃǃǃ | ǃUǃ | Uǃǃ | ǃUǃ | ǃUǃ | ǃUǃ | UǃU |
కదలె | నుకార్మి | కుండుక | లకాల | మునూడి | గమాచ | రించినం |
యతి క - కా - ప్రాస - ద
3. శార్దూలము :
సారాసారవిశారదా ! యిన యతిన్, శార్దూలవిక్రీడితా
కారంబై, మన జమ్ములిమ్ముగ, సతాగప్రాప్తమై చెల్వగున్.
మ, స, జ, స, త, త, గ, అను గణములు వరుసగ నుండి, పదమూడవ, అక్షరమున, యతిచెల్లిన శార్దూలమగును. అక్షరములు 19.
ఉదా :
మ | స | జ | స | త | త | గ |
UUU | ǃǃU | ǃUǃ | ǃǃU | UUǃ | UUǃ | U |
భిన్నత్వం | బున, నే | కసూత్ర | మును, భా | వించెన్ క్రి | యాశీల | సం |
యతి - భి - వి - 1 - 13. ప్రాస 'న్న'.
సులభ వ్యాకరణము