పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

119


1. ఉత్పలమాల :

"భాను సమానవిన్ భ, ర, న, భా, ర, ల, గం, బు, ల గూడి మిశ్రమ స్థానమునందు, పద్మజయుతంబుగ, నుత్పమాల యై చునున్,"

భ, ర, స, భ, భ, ర, వ, (లగము) లు వరుసగా నుండి 10 వ స్థానమున యతి చెల్లిన ఉత్పలమాల యగును.

ఉదా :

Uǃǃ UǃU ǃǃǃ Uǃǃ Uǃǃ UǃU ǃU
నీవుజ నించిన ట్టి స్మర ణీయ ది నంబది విశ్వశాం తికిన్

యతి - నీ - ణీ - ప్రాస 'వు'

అక్షరములు 20. పాదములు నాలుగు.

2. చంపకమాల :

        న జ భ జ జ జ ల్, జరెఫల, బెనంగ, దిశాయతి తోడ కూడినన్
        త్రిజగదభిస్తు తా ! బుధనిధీ ! విను చంపకమాల యైచనున్;

న జ భ జ జ జ ర అను గణములు వరుసగానుండి, 11 వ స్థానమున యతి చెల్లిన, చంపకమాల పద్యమగును. పాదమున అక్షరములు 21. పాదములు 4.

సులభ వ్యాకరణము