ఈ పుట ఆమోదించబడ్డది
118
రెండవపాదమున మొదటి అక్షరము 'నీ' కిని అందలి మూడవ గణము మొదటి అక్షరము 'నె'కును యతి మైత్రి చెల్లినది.
విశేషాంశము : గణముల నియమమును బట్టి పాదములు సమానములే అయినప్పటికిని, ఈ గణము అని నిర్దేశము లేక సూర్యగణములు చంద్రగణములు నని చెప్పబడినందున - కొన్ని సూర్యగణములు రెండక్షరములనియు, కొన్ని మూడక్షరములనియు, అట్లే కొన్ని యింద్ర గణములు, మూడక్షరములనియు కొన్ని నాలుగక్షరములవియునై యుండుట చేత, పాదములయందలి అక్షరముల సంఖ్యలో భేదము వచ్చును. కావుననే యతి స్థానము యిన్నవ అక్షరమనిగాక యిన్నవ గణము మొదటి అక్షరమని చెప్పబడుచున్నది.
వృత్తములు
| పేరు | గణములు | యతి | మొదటి గణము | అక్షరములు |
| ఉత్పలమాల | భ ర న భ భ ర వ | 10 | భ | 20 |
| చంపకమాల | న జ భ జ జ జ ర | 11 | న | 21 |
| శార్దూలము | మ స జ స త త గ | 13 | మ | 19 |
| మత్తేభము | స భ ర న మ య వ | 14 | స | 20 |
| మత్తకోకిల | ర స జ జ భ ర | 11 | ర | 18 |
| తరలము | న భ ర స జ జ గ | 12 | న | 19 |
| పంచచామరము | జ ర జ ర జ గ | 10 | జ | 16 |
| మానిని | భ భ భ భ భ భ భ గ | 13 | భ | 22 |
| మాకిని | న న మ య య | 9 | న | 15 |
| స్రగ్ధర | మ ర భ న య య య | 8, 15 | మ | 21 |
సులభ వ్యాకరణము