పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

117


3. సీసపద్యము - లక్షణము :

         ఇంద్రగణము లారు, నిన గణంబులు రెండు
         పాదపాదమునకు బరుగుచుండు
         ఆట వెలదియైన, తేటగీతియునైన,
         చెప్పవలయు మీద, సీసమునకు.

వరుసగా ఆఱు ఇంద్రగణములు, తరువాత రెండు సూర్యగణములు గల నాల్గుపాదములు చెప్పి ఆమీద ఒక తేట గీతిగాని, ఆటవెలదిగాని చేర్చవలయును.

మొదటి నాలుగు పాదములలోను ఒక్కొక్కటి రెండేసి చరణములగును. అనగా మొదటి చరణమునకు నాలుగింద్ర గణములుండును. రెండవ చరణమునకు మొదటి రెండు ఇంద్రగణములు తరువాత రెండు సూర్యగణములు నుండును. రెండు చరణములకు వేర్వేరు యతియుండును. చరణము యొక్క మొదటి అక్షరము మూడవ గణముయొక్క మొదటి అక్షరముతో యతిమైత్రి కలిగియుండును. ప్రాసయతి వేయవచ్చును.

ఉదా : -

సల
UUǃ UǃU ǃǃUǃ UUǃ
రాకేందు బింబమై రవిబింబ మైయొప్పు
UǃU Uǃǃ
నీరజా తేక్షణ నెమ్మొ గమ్ము

ఇందు మొదటి పాదమున మొదటి అక్షరము 'రా'కును మూడవ గణము మొదటి అక్షరము 'ర'కును యతి చెల్లినది.

సులభ వ్యాకరణము