పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

115


5. మధ్యాక్కర - లక్షణము :

2 ఇంద్ర గణములు 1 సూర్యగణము. 2 ఇంద్రగణములు, 1 సూర్యగణము. ఈవిధమున వరుసగా ప్రతి పాదమున ఆరు గణములుండును. ఐదవ గణము మొదటి అక్షరము యతి స్థానం.

ఉదా :

నగ నగ
ǃǃǃǃ UǃU UUǃ UUǃ ǃǃǃ
నరసుర స్తుత్య మై యెంత కాలంబు నా కీర్తి నిలుచు

న - నా - యతి - చెల్లినది

ఉపజాతులు

సూర్యగణములు, ఇంద్ర గణములు కలిగి యతితో కూడి యుండును. ప్రాస నియమము లేదు. ప్రాస యతి వేయవచ్చును.

1. తేటగీతి - లక్షణము :

            "సూర్యుడొక్కరుండు రరాజు లిద్దరు
             దిన కరద్వయంబు తేటగీతి"

నాలుగు పాదములు సమానములు. ప్రతిపాదమునను, మొదట ఒక సూర్యగణము, తరువాత రెండు ఇంద్రగణములు, తరువాత రెండు సూర్యగణములు ఉండవలెను. నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము.

సులభ వ్యాకరణము