ఈ పుట ఆమోదించబడ్డది
114
మొదటి అక్షరము 'భూ' అనుదానికి, మూడు ఐదు - ఏడు గణముల మొదటి యక్షరమయిన బు - బొ - బు - అనువానికి యతిమైత్రి సరిపడినది.
4. ఉత్సాహము - లక్షణము :
వరుసగా ఏడు సూర్య గణములు, ఆపై ఒక గురువుండును. 5 వ గణము మొదటి అక్షరము యతిస్థానము. ప్రాసనియమము కలదు.
ఉదా : -
హ | నగ | నగ | హ | హ | నగ | హ | |
Uǃ | ǃǃǃ | ǃǃǃ | Uǃ | Uǃ | ǃǃǃ | Uǃ | U |
పోలు | ననుచు | పెరిగి | రాజ | పుత్రు | లదిగి | యార్చి | పాం |
హ | నగ | హ | నగ | హ | నగ | హ | |
Uǃ | ǃǃǃ | Uǃ | ǃǃǃ | Uǃ | ǃǃǃ | Uǃ | U |
చాలు | పురము | ముట్టి | కొనిరి | సంఖ్య | బలస | మేతు | లై |
మొదటి పాదములోని మొదటి అక్షరము 'పో'కును - అయిదవ గణములోని 'పు'కును యతి చెల్లినది. అట్లే రెండవ పాదములోని 'చా'కును 'సం'కును యతి చెల్లినది.
సులభ వ్యాకరణము