పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102


6. అవ్యయీభావ సమాసము :

లింగ, వచన, విభక్తులు, లేని అవ్యయములు. అవ్యయము పూర్వపదముగా కలది అవ్యయీ భావ సమాసము.

       యధావిధి - ప్రతిదినము - ఇందు
       యధా - ప్రతి అనునది అవ్యయములు.
       యధావిధి - విధి నతి క్రమింపక.
       ప్రతిదినము - దినము, దినము
       వ్రత్యహము - అహాము, అహాము.
       అని విగ్రహము చెప్పు కొనవలెను.
       ఈ సమాసము తెలుగునలేదు.

ప్రశ్నలు

1) సమాసమనగానేమి? శబ్దము ననుసరించి సమాసము లెన్ని రకములు? అవియేవి?

2) ఆచ్చిక సమాసమును సోదాహరణముగ తెల్పుము?

3) అర్ధ భేదమును బట్టి సమాసము లెన్ని రకములు? అవి యేవి?

4) అవ్యయీభావ సమాసమనగానేమి? సోదాహరణముగ తెల్పుము?

5) ఈక్రింది సమాసము లేవో తెల్పుము.

1) కడతల 2) నెలతాల్పు 3) గుణహీనుడు 4) మాటనేర్పరి 5) కపోత వృద్ధము 6) గంగానది 7) గాజులసెట్టి 8) ద్వైమాతురుడు 9) రామకృష్ణులు

10) పద్మాలయ

సులభ వ్యాకరణము