పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

ఇందు గల ఉపమాన ఉపమేయములు రెండు ఒక్కటియే అయి యుండును. దీనినే రూపక సమాస మందురు. సంభావన అనగా గౌరవించుట. ఇందు మొదటి పదము సంజ్ఞావాచకముగ ఉండును. రెండవ పదము జాతి వాచకముగ నుండును.

3. ద్విగు సమాసము :

సంఖ్యా వాచకపదము పూర్వమున కలది ద్విగు సమాసము. ఇవి మూడు విధములు.

1. తద్దితార్థ ద్విగువు : తద్ధిత ప్రత్యయములు చేర్చుటకై చేసిన ద్విగువు.

ఉదా : షాణ్మాతురుడు - ఆఱుగురు తల్లుల కొడుకు.
         ద్వైమాతురుడు.

2. ఉత్తరపద ద్విగువు : ఉత్తర పదము పరముగా నుండగా వచ్చు ద్విగువు.

ఉదా : పంచగవధనుడు - ఐదు ఆవులు ధనముగా గలవాడు. ధన అను ఉత్తరపదము పరముగా నుండుటచే వచ్చిన ద్విగువు.
        ఇట్లే - ద్వ్యహ్నజాతుడు.
        రెండు దినముల క్రింద పుట్టిన వాడని భావము.

3. సమాహారద్విగువు : సమాహారమని అర్దమిందువచ్చును.

  త్రిలోకి - మూడు లోకముల సమాహారము.
     శతగ్రంధి - శతమైన గ్రంధముల సమాహారము.

4. ద్వంద్వ సమాసము :

ఉభయ పదముల అర్ధము ప్రధానముగా గలది

సులభ వ్యాకరణము