పుట:Leakalu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కదలికా లేదు. పాత్రచిత్రణాలేదు. * భాణాసురుని మేనల్లునికీ ఉషాధాత్రేయికీ మధ్య నాటకకర్త నడిపించిన శృంగారఘట్టాలు చదవడానికీ అసహ్యమే; వినడానికీ రోతే, వొట్టి అలంతప్ప మరేమీ కనిపించదు. శాస్త్రిగారు 'బఫూనరీ'నే హస్యచమత్కారాలనుకుంటున్నారు.

'కన్యాశుల్కం' దాదాపు అయిపోయినట్టే. చివరిరంగం అచ్చవుతోంది. త్వరలోనే పూర్తి నాటకం నీ చేతికొస్తుంది. శ్రీనారాయణనూర్తి దీనిని అత్యద్భుత కళారూపమంటున్నారు. కాపీలు త్వరత్వరగా చెల్లుబడి అవుతాయని పెద్ద పెద్దబుక్సెర్లర్లు జోస్యంచెబుతున్నారు, మిస్టర్ ఏట్సు నాటకాన్ని కొనియాడుతూ బహుచక్కని పీఠిక వ్రాశాడు. మరి మనం పొగడ్డల మీద నే బతుకుతున్నాం కదూ !

ఈ ఏడు నా ఆరోగ్యం సరిగా లేదు. బాగానీరసించిపో యాను. కాని ఉదకమండలం వచ్చాక కా_స్త నయం, ఇప్పడు కులాసాగానేవుంది,

నాటకం చివర నువ్వు పంపిన పదములపట్టిక'లో కొంత భాగం చేరుస్తాను. మీనాన్నగారికి నా వందనాలు, నెల్లూరు నువ్వెపుడు వెళతావు?

పి. యస్ ; మద్రానుంచొచ్చే మెయిలు నెల్లూరు ఎన్ని గంటలకు చేరుతుందో


  • బాణాసురిని మేనల్లుడు గంభీరవేది. ఉషాధాత్రేయి కరేణుక. బాణుని సభామంటపమున కరేణుక ప్రవేశించి “నారాయడు కూర్చునే యీకుర్చీలో వాళ్లిచ్చేదాకా కూర్చుంటా. ఇదైతే నాకు సరిపోతుంది
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/99&oldid=153048" నుండి వెలికితీశారు