పుట:Leakalu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాతఫక్కీ తలనొప్పి చికాకు. అన్నీ పాతసంప్రదాయలే! అంతా కన్వెన్షన్ల మయo, "తామర ఆకులు, సెజ్జలు, చంద్రకిరణతాపం విరహవేదన అన్నీని, లేని వేం లేవు. పాత్రౌచిత్యమూ లేదు


వుంటారు. విరహ తాపంలో బాధపడే ఉష : ఏమియిది, నా ముద్దులకూనలందు ఈ పువురాసులు! ఈ తేనెసోనలు...ఇదేమి యింద్రజాలమా ! ఓహో కాదుకాదు. ఆహాహా ! ఏమియివి ! నన్నేచుచున్నవి ! ఇవి నిక్కముగా పూ ములుకులే ; అయ్యో ! నా కూనలారా ! ...,

మూడవ ఆంకం; అనిరుద్దుడు : వయస్యా, నేనొకనాడు కలలో నొక జగన్మోహినిని వరించితిని...కలలో వరించి మేల్కొని కానక యీయవస్థకు పచ్చినాడను....

విదూ : అదేదో పిశాచమని నేను మొదటనే చెప్పలేదా. మా వేపా వారిపిల్లమాత్రం మదనపాశంలాగ లేదుగాని యమపాశంలాగ వుండినది. మొత్తానికి పోలికవుంది, బళిబిళి ! కనకనే నీకింత వెట్టిపట్టింది? ఇంకా ? ఆ బొబ్బట్ల మడతలను వర్ణించవయ్యా,

అని : వినుము మిత్రమా;

హృదయజుఁ డాత్మకామినికి నీఁతలు నేర్పుటకున్, దదర్థమౌ మృదుచరణావతారమున మెచ్చొదవన్, బరువంపు మంత్రి వే పదిలము సేయు ఉగ్గియయు, బంగరుఁదాపలు, నీ లిమొహ్మ లు నృద వసనంబుఁగా, దయితనాభియు, ముత్తు లారుఁ జెన్నగున్.

(భావం : దొరయైన మన్మథుడు భార్య అయినరతీదేవికి యీతలు నేర్పడానికై యావనమనేమంత్రి నిర్మించిన దిగుడుబావిలాగ పొక్కిలి వుంది.ఆందులోదిగేటపుడు మెచ్చుకలిగించడానికికై మృదువుగా వుండేటట్టు కట్టించిన బంగారపమెట్ల వరసవలె వళిత్రయము ఒప్పారుతోంది. ఆమెట్ల పనసపై పాదాలను ధూ అంటకుండా మెత్తగా వుండడానికని, దారిగా పరిపించిన నల్లమొహమలు పట్టు రేకుపలె ఆ తరుణీమణి నూగారు ఒప్పతోంది.)

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/98&oldid=153047" నుండి వెలికితీశారు