పుట:Leakalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇన్ని విషయాలను యింత విస్తరించి ఎందుకు వ్రాస్తున్నానంటే నా రెండవనాటకంలో ఈ సమస్యను కొద్దిగానైనా చర్చించ దలుచుకున్నాను. -

అవును * కామ్టే అనే పాజిటవిస్టుతత్వవేత్త మానవ త్వాన్ని వొక మతవిశ్వాసంగా విస్తృతపరిచాడు. మానవత్వ


  • అగస్తికాఫ్టే ; (1798-1857) ఫ్రాన్సు దేశస్థుడు; పాజిటవిజమనే తత్త్వమునకు ఆచార్యుడు. మొదట సెయింటు సైమన్ అనే తత్త్వాచార్యునికి శిష్యుడిగా వుంటూ, పిమ్మట ఆయనతో విభేదములురాగా, తనకు తానై ప్రత్యేకంగా ఒకనూతన త్పాత్త్విక్షసిద్ధాంత్రాన్ని స్థాపించాడు. కార్య కార్ణ సంబంధములలో కారణముతో ప్రమేయం లేకుండా ప్రకృతి యందలి దృశ్యమానవస్తువుల పరిస్థితులను పరిశీలించి, విశ్లేషించడం ఆయన పద్ధతి. రసాయనిక, పదార్ధ విజ్ఞాన ఖగోళ గణిత, శాస్త్రాదుల ధర్మసూత్రాలన్నీ సామాజికశాస్ర నిర్ధారణకు ఉపకరణములనీ, మానవ సేవయే వాటిపరమావధిఅనీ ఆయనదృష్టి. బాహ్యజగత్తులోని దృశ్యమాన వస్తువుల ధర్మసూత్రాలకు ఆయన అన్వేషణలో ప్రాధాన్యత హెచ్చు. వాటికారణాలకు ప్రాధాన్యతలేదు. ఏభావమైనా, బాహ్యసామాజికజగత్తు లలో ఎంతవరకు ఉపయుక్తమనే పరీక్షపై, దానివిలువ నిర్ధారింపబడు తుంది. దృశ్యమానవస్తునం వినా, మానవునికి యింకొక జ్ఞానం వుండదు. ఆ వస్తుణ్ణనమైనా సంపూర్ణమైనదికాదు. ఇలా పాజిటవిజమ్లును వివరిస్తూ కామ్టే ఆప్భాగాల వేదాంత గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ మతంలోని నైతికధర్మవిలుప్తతకు అసంతృపడై_ “మానవ ఆరాధన' అనే దానిని తనతత్త్వానికి చేర్చాడు. ఆధిభౌతికశక్తుల ఆరాధనకు స్థానే, వూన వత్వ ఆరాధన మనే భావాన్ని స్థాపించి తన మతమును విస్తృతపరి చాడు. అదే “రెలిజన్ ఆఫ్ హ్యూమానిటి". పందొమ్మిదవ శతాబ్దంలో పాజిటవిజము ఎంతో ప్రభావముకలిగి, స్టూవర్ట్ మిల్, స్పెన్సర్, ఫ్రెడరిక్ హారిసన్ ప్రభృతులదృష్టిని ఆకర్షించింది. వారు ఇంగ్లండువంటి దేశాలలో దీనికి బహుళ ప్రచారాన్ని కల్పించారు.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/96&oldid=153045" నుండి వెలికితీశారు