పుట:Leakalu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీతి, నైర్మల్యపవిత్రములనే అనుభావాలను నేను కొని యాడుతున్నాను. అయితే అట్టి అనుభవాలకు గల నిజస్వరూప మెట్టిది ? వీటి నిజతత్వమేమిటి ? వీటి పుట్టుకలు, నడత యేవిధ మైనవి ? ఈ పవిత్రత ఎందులో యిమిడివుంది ?

అందుకోలేని దుస్సాధ్యమైన సామూజిక నీతిసూత్రాలపై స్త్రీపురుష సంబంధాలు ప్రస్తుతం ఆధారపడివున్నవని నాభావం. ఈ సామూజిక నియమూలు నిర్ణ యిస్తున్న స్థాయి, ఎవరూ చేరు కోలేనంత దుస్సాధ్యమైనదనీ ఎవరికి అందుబాటులో లేనిదనీ నా నమ్మకం. ఈ ఆదర్భాలలో అనేక లోపాలు వున్నాయని నేననుకుంటున్నాను.

మనం యేదయితే నిజమని నమ్ముతున్నామో దానిని ఆ పరమసత్యాన్నీ మనం నిర్మొహమాటంగా చిత్తశుద్ధితో నిష్కర్షగా, పైకి చెప్పవలసిన సమయ మాసన్నమయింది, మనకు మనమే, సత్యంపట్ల విధేయులమై వుండాలి. మనకు మన అంతరాత్మయే సాకి, నువ్వంటున్నావుకదా అపవిత్రురాలైన వివాహిత స్త్రీ పురుషు లిద్దరూ వొక భోగం పడుచు వలె సమూ నంగా ఏవగించుకోతగినవారని, ఈ రెండుతరగతులవారికి వున్న వ్యత్యాసం ఏమిటో నువ్వాలోచించి నిర్ధారించలేవా? కాస్త దూరం యోచిస్తే అసలువిషయం నీకిట్టే అవగతమవుతుంది. నీ ఆలోచనల కట్టి శక్తి వున్నది కనక యీ వ్యత్యాసాలను అవలీ లగా పోల్చుకోగలుగుతావు. కొంచెం నిశితంగా ఆలోచించి చూడు. వొక్కసంగతి: భోగం పడుచు తన వృత్తికి బద్ధురాలు, విధేయురాలు. దేనిని చెబుతున్నదో దానిపట్ల ఆమె నిజాయి తీగా ప్రవర్తిస్తోంది. నేనీ విషయాన్ని దానిస్వభావాన్నిబట్టి విషయబద్ధంగా యోచించిమాత్రమే అవలోకిస్తున్నాను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/95&oldid=153044" నుండి వెలికితీశారు