పుట:Leakalu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈవిధంగా తార్కిక దృష్టితో దీనిని తరచి తరచి విస్తరించి చూడవచ్చును.

జపాను దేశంలో "గైషా" అనే నృత్యం చేసే భోగంపడ చులను గురించి నువ్వు చదివేవుంటావనుకుంటాను. స్త్రీ పురుష శారీరక సంబంధాలు ఆ దేశంలో అంతపట్టింపుగా లేవు. ఇవి ఒక ప్రక్క- యథేచ్ఛగవుంటూనే వున్నవి. మరొక వంక దానిస సనే, ఖండితమైన జాతీయ జీవితమూ, భౌతిక జీవితావసర వస్త సంపద పుష్కలంగా వుంటూనేవున్నాయి. ఇంతకంటె విచిత్ర మేమంటే, ఆ దేశంలో ఉన్నత రాజకీయ ఆదర్శాలు బోలెడు

సెంటిమెంటు వూసుకేంగాని, స్త్రీ పురుష శారీరక సంబంధమైన సమస్యలను నేనిలాగ వీక్షిస్తాను, విశ్లేషిస్తాను, పరిశీలిస్తాను సమాజం నిర్ణయించిన నీతిసూత్రాలు మనకు కొన్ని వున్నాయి వాటిని గౌరవించడం మనవిధి. అందులో స్త్రీ పురుష పరస్పర సంబంధాలను విధించే ధర్మసూత్రం వొకటి. ఈ సాంఘిక శాసనాలు మన కవరోధం కలిగిస్తున్నవని, మనలను వెనక్కు లాగతున్నవని మనకు రుజువవుతున్నపుడుతప్ప, వీటి నతిక్రమించడఁ వొక నేరమే. అయితే ఈ సాంఘిక శాసనాలు ధర్మాలు, లోప భూయిష్టంగా వున్నపుడు వాటిని మనం బాహాటంగా ఎదు ర్కొని సంస్కరించవలసి వుంటుంది. నువ్వొక న్యాయానికి ధర్మా నికి, సామాజిక నియమానికి లోబడి వుండవలెనన్నపుడు, దానిని అనుసరిస్తున్న నీకూ వొకహక్కు వుంది, అది ఎంతవరకు అంగీ కారయోగ్యమో దానిని సూడ్మాతిసూక్ష్మంగా పరిశీలించే నీకు గల యీ హక్కును ఎవరూ రద్దుచేయరాదు, అది దోషభూయిష్టమైనదని నువ్వువిశ్వసిస్తున్నపుడు, దానిని సంస్కరించే హక్కూ అధికారమూ నీకు వుంది.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/94&oldid=153043" నుండి వెలికితీశారు