పుట:Leakalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలహీనులైన కురూపులైన దుర్మార్గులైన నిరుపేదలైన భర్తలనుగురించి భార్యలు యేవిధంగా తలపోస్తారో కాస్త వూహించేందుకు ప్రయత్నించు, 'అయితే దుష్టులు, కురూ పులూ అయిన భార్యలు మాత్రం లేరా అని బహుళా నువ్వు ప్రశ్నించవచ్చును. కాని ஆல బానిసలు, స్వాతంత్ర్యమన్న దేమిటో వాళ్ళు ఎరగరు. భార్యలు తమ భర్తలయందుండగోరు సద్వర్తన పవిత్రతలకంటె ఎక్కువ సద్వర్తన పవిత్రతలను భార్యల యందు వుండవలెనని భర్తలు వాంఛిస్తున్నారు, ఇదే స్త్రీలకూ పురుషులకూ వుండే వ్యత్యాసం.

మాటవరసకి సద్వర్తనపరులు కాని మగవాళ్ళనందరినీ నువ్వు అసహ్యించుకుంటున్నావనుకుందాం. వాళ్ళను నువ్వు ద్వేషిస్తున్నావనే భావించుకుందాం. ఇపుడు నీ స్నేహితులలో యీ గుణపరీక్షకు ఎంతమంది నిలబడతారు ?

స్త్రీ ఖన్నురాలు కావడానికి కారణం తాను యివ్వగలిగిన దానికంట అధికంగా పురుషుడు తననుంచి వాంఛిస్తున్నాడు కదా అని. అయితే పురుషుడు దుఃఖితుడు కావడానికి హేతువు "తాను ఆపేక్షించినంతగా స్త్రీ తనను పువ్వుల్లో పెట్టి పూజించడం లేదని; నిశ్చలభక్తితో ఆరాధించడం లేదని. ఈర్ష్య అంటే ఏమిటి ? భర్త అందగాడు కాడు, రూపురేఖావిలాసాలు లేనివాడు, భార్య అతని అందచందాలను మెచ్చుకోలేదు. అంద చందాలుగల వొక అపరిచయస్థుని మెచ్చుకోకుండా వుండలేదు. కాని ఆమె అలాగ చేయకూడదు, ఎంత అసాధ్యం! భర్త తెలివి తేటలు లేనివాడు. అతనికి యింగితజ్ఞానం పూజ్యం. అయినాసరే, అతని మేధాసంపత్తిని భార్య ప్రస్తుతించి తీరాలి,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/93&oldid=153042" నుండి వెలికితీశారు