పుట:Leakalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ పై, నారాయణమూర్తి * నానాటకాన్ని "అత్యద్భుతమైన కళాసృష్టి" అంటున్నారు. కాని నూట ఇరవైఎనిమిదో పేజీ వచ్చేసరికి ప్రధానోత్సుకత అనే గడపముందు నిలబడ్డట్టు నీకనిపిస్తుంది. అటు తరవాత వచ్చేరంగాలు, నాటకంలో ఉత్తమమైన వని నేను భావిస్తున్నాను.

శ్రీవేంకటరాయశాస్త్రిగారి 'ఉషా' నాటక ప్రతినొక దానిని శ్రీవేంకటేశ్వరులు నాకు పంపించారు. పాపం, వేంకటరాయశాస్త్రిగారికి "కళ" అంశ యేమిటో బొత్తిగా లేలియదు. గ్రీకు నాటకాలలో “కోరస్" ల్లాగ ఆంగ్లంలో "ప్రోలోగ్"ల వలె కథాకథనం కోసం ఆయన తన నాటకంలో విష్కంభాలను + ఆశ్రయించారు. నాటకంలోవచ్చే దేవతా మూర్తలను వొట్టి పిరికి పందలుగా చిత్రించారు. ఇక బాణాసురుణ్ణంటావా కడు దురహంకారిగా మర్యాదా మప్పితమూ యేకోశానా లేని జడునిగా అమితనీచునిగా తనతండ్రి అని ఉష


  • శ్రీ ఎనమండ్ర నారాయణమూర్తిగారు; పట్టభద్రులు. చెముడు జమీందారుకు కొంతకాలం ట్యూటరుగానూ కొంతకాలం విజయనగరం కళాశాలలో లెక్చరర్గానూ రాజవద్ద కార్యదర్శిగానూ పనిచేశారు."ఆడవి మల్లెలు" అనే ఖండకావ్యకర్త. మేఘ సందేశమును అనువదించారు, గ్రాంథికవాది. అప్పారావుగారి సన్నిహితమిత్రులలో ఒకరు.

+ ఉషా నాటకమున ద్వితీయాంకము తరవాత ప్రవేశకం, ద్వితీయః [ప్రవేశించి] వొళేబంబరికా, యేమే నువ్వింకా యీతోటని అలంకరించకున్నావు. కొమార మహారాజు అనిరుద్ధులవారికి మరీయిష్ట మైన తోటగదటే యిది : -

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/89&oldid=153038" నుండి వెలికితీశారు