పుట:Leakalu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నువ్వు వాస్తవిక విషయాలను యదార్థాలను కప్పి పుచ్చకు. ఇంతే నేను నిన్ను కోరుతున్నది. రోగికి డాక్టరు శస్త్ర చికిత్స చేసినట్లు సమాజంలోగల రుగ్మతలను కత్తితీసుకొనికోసి దేనికది విడదీసే అన్ని భాగాలనూ పరీక్షించి చూడు.

మనం మూర్తిభవింపచేయవలసిన పేమ విశ్వమానవ పేమ. తోటి మానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు. నిజమైన ఆరాధించతగిన ప్రేమయేది? తనయుగంలోవున్న అవధులలోనే పోనీ, క్రీస్తు యేది బోధించాడనుకుంటున్నామో దేన్ని కళా విలాసమ్ని కవితాసత్యమని పెల్లీ ప్రవచించాడో ఇదీ ఉత్తమ మైన రాజమార్గమని జేనిని బుద్ధుడు మనకు ఉపదేశించాడో అదే నిజమైన ఉన్నతమైన పేమ! మానవజాతిపై మనకు వుండ వలసిన ప్రేమ!

ఏనాడు బౌద్ధమతం భారత దేశంలో తుడిచిపెట్టబడిందో ఆనాడే భారత దేశం మతవిషయిక ఆత్మహత్యను చేసుకుంది.

ఎక్కహిల్ హౌస్
ఉదకమండలం
24 మే 1909

ప్రియమైన ముని సుబ్రహ్మణ్యం పంతులు,

నీకార్డు అందింది. నాధన్యవాదాలు. నువ్వుపంపిన 'పదముల పట్టిక చేరింది'. వీటిలో కొన్ని శబ్దాలు నిఘంటువులలో నీకగుపిస్తాయి. కన్యాశుల్కం చివర పెద్దజాబితా చేరుస్తాను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/88&oldid=153037" నుండి వెలికితీశారు