పుట:Leakalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవజీవితంలో కాని లేదా సారస్వత కల్పనలలో కాని ఎందులోనైనా స్త్రీపురుషశారీరకానుభవాలూ ఆనందాలూ వాటి వర్ణనలూ త త్తదుచితస్థానంలో వుండాలి. ఇపుడు వీటికి అనుచిత ప్రాధాన్యమిచ్చి గోరంతలు కొండంతలు చేస్తున్నారు.

రోమనుడైన • 'కేటో' ఎవరికో సరిగా జ్ఞాపకం లేదు కాని, తనభార్యను ఎరువుయిచ్చాడు. చంద్రవంశపు పట్టమహి షలను పుండా కోరులైన బ్రాహ్మణులకు బాహాటంగానే తార్చి నట్లు కనిపిస్తుంది. బాహాటంగా జరిగినవే యిలావుంటున్నపుడు యింక రహస్యంగా ఎన్ని దుర్మార్గాలు అవినీతికర చర్యలు దోషాలు జరిగాయో కదా? మీ యితిహాసాలను పురాణాలను వొక్కసారి చదివిచూద్దూ నీకే తెలుస్తుంది !


  • మార్షన్ పోర్షియస్ అనీ కేటో మేజర్ అనీ ఇతన్ని పిలిచేవారు. ఉన్నత వంశీకుడు; సామాన్యులతో సాయిలా పాయిలాగా తిరిగేవాడు. అనేక ఉద్యోగాలు చేశాడు. సైన్యంలో కొంతకాలం పనిచేసి రోము నగరం చేరుకున్నాడు. ఆనాడు జరిగిన మతయుద్ధాలలో పాల్గొని స్పెయినును లోబరుచుకున్నాడు. ఎలాంటి మార్పులకూ అంగీకరించని మనస్తత్వం కలన్యక్తి. ఇతనికాలం క్రీ. పూ. 284.149.

ఇతనిమునిమనుమడు కేటోది యంగర్,స్టోయిక్ వేదాంతాధ్యయన నిమగ్నుడై కాలం గడిపిన వ్యక్తి. నాటి రాజకీయరంగంలో కీర్తిగడిం చిన వ్యక్తులపై నిరసనభావం; ముఖ్యంగా సీజరుపై అయిష్టం. పాం పే, సీజరులలో పాంపేను ఇతను సమర్ధించి ఆతనిపక్షం అవలంబించి, పాంపే ఓడిపోగానే, “ఉటికా" చేరుకున్నాడు. సీజరు చేతులలో చిక్క కుండా చివరకు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతనికాలం క్రీ. పూ. 95 - 46.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/87&oldid=153036" నుండి వెలికితీశారు