పుట:Leakalu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామప్రవృత్తి అనే పదాలను ప్రత్యేకం గుర్తుపెట్టుకో, లైంగిక వాంఛలు శారీరక పరిస్థితులపై ఆధారపడి వున్నాయి.

చికాకులతో జీవితంలో వొడిలిపోయిన పబైయేళ్ళ ముసలిదానిని వొక నవయవ్వనుడు యెందుకు ప్రేమించడు? వేడివేడి భోజనపదార్ధాలవలెనో వికసించిన ఎర్రగులాబీవలెనో కాలంలోవున్న ఆడదీ యింద్రియాలను ఆకర్షిస్తుంది. మేకుల్లా చల్లని అన్నం చివిఁడిముద్దయిన అన్నం వాడిపోయిన పువ్వూ; వీటిని నువ్వు ఖాతరుచేయమన్నా చేయవు. వేడివేడి అన్నం మల్లెపూవుల్లా తెల్లగా వుమ్మగిల్లిన అన్నం నీ చవులూరి స్తుంది. అదేవిధంగా వికసించిన రేకులతో పరిమళమిచ్చే గులాబీ! ఇవి చెడిపోనపుడు దుమ్ములో కలిసిపోనపుడు మంచి పసందుగావున్న తరుణంలో నువ్వు వాటిని అనుభవించకుండా అవి నిన్ను వారించడం లేదు!

'జీవితం నీటి బుడగవంటిదని సౌందర్యం అశాశ్వతమని' సిద్ధాంతాలుచెప్పే వేదాంతుల సూక్తుల మాట కేం లే! ఈ వుత్తుత్తి కబుర్లన్నీ తీసి అవతల పెట్టు. జీవితమూ సౌందర్యమూ అశాశ్వతమైనవని చెప్పే సిద్ధాంతాలు యింద్రియసుఖాలు పరిత్యజింప తగినవనే వాదానికి బలాన్నీయవు. జీవితమూ సౌందర్యమూ అశాశ్వతమైనవని చెప్పినంత మాత్రంచేత యింద్రియసుఖం విడువ తగిందికాదు. నిజమాలోచిస్తే యిలాటి వాదములవల్ల యింద్రియసుఖాలు అనుభవింపతగినవనే వాదం ధృవపడుతున్నది.

దోషమన్నది అతిలోలత్వంలో యింద్రియ చాపల్యంలో యిమిడివుంది. మితిమీరిన చపలత్వం దోషం కాదా మరి? ఈ అతిలోలత్వపు ఫలితం వెంటవెంటనే కనిపిస్తుంది.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/86&oldid=153035" నుండి వెలికితీశారు