పుట:Leakalu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్య లేఖలు* : నాటక గోష్ఠి

ఫోర్డు విజయనగరం
11 మార్చి 1909

ప్రియమైన సుబ్రహ్మణ్యం+

నువ్వు పరీక్ష ప్యాసయావని నేనెంతో ఆనందించాను. మదరాసులో వుండగా నీకు జబ్బుచేసిందా నాఆందోళన అంతా యింతా కాదు. పరీక్షల నాటికి నిమ్మళిస్తుందో నిమ్మళించదో నని


  • ఇవి శ్రీ వంగోలు ముని సుబ్రహ్మణ్యము గారికి మహాకవి వ్రాసిన లేఖలు. మహాకవిని సంస్మరిస్తూ శ్రీ సుబ్రహ్మణ్యముగారు 1986 ఫిబ్రవరి 27 వ తేదీన హిందూ దినపత్రికలో వ్రాసిన వ్యాసం, జిజ్ఞాసా పరులు చదువతగ్గది. “మనకు పోస్టుద్వారా, పాఠాలను చెప్పే సంస్థలు కొన్ని వున్నవి. అలాగ పాఠాలను నేర్చుకున్నవారిలో నేనొకడిని. విజయనగరం, మద్రాసు, ఉడకమండలముల సుంచి అప్పారావు పంతులు గారు, తమ లేఖల ద్వారా, అనేకవిషయాలను నాకు బోధపరుస్తూ వుండేవారు."

+. శ్రీ వంగోలు ముని సుబ్రహ్మణ్యంగారు: 1886 అక్టోబరు 2 వ తేదీన నెల్లారుజిల్లా నాయుడుపేటలో జననం. 1908 లో వంగోలులో మెట్రిక్యులేషన్ ప్యాసంు ఉన్నత విద్యాభ్యాసంకోసం 1904 లో విజయ నగరం వెళ్లి 1908 వరకు ఆక్కడ చదివి పట్టభద్రులయారు. వారికి 1906 లో మహాకవితో పరిచయభాగ్యం లభించింది. 1909 జనవరి నుంచి ఆరునెలలవరకు వారి స్వస్థలమైన నెల్లారులో ఉపాధ్యాయులుగావుండి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/71&oldid=153020" నుండి వెలికితీశారు