పుట:Leakalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింగంబులుం జన వెఱచు నిది మఱచి యే నెంత తోలిన మన వాహనం బచటి కెదురు నడచు? మన మమ్మ హాళ_క్తికి నభివంద నంబు చేసిపోయి గార్యసిద్ధియగు రమ్మనుచు నల్లన తనభల్లూక చర్మకోళంబుతోడి ఖడ్గంబు పుచ్చుకొని సింగంపుబల్లనముఁ బోక యక్కడనయొక్కమఱుంగున డాఁచి యాచపలలోచనను మృ గేంద్రవాహనగుడికిం దోడ్కొని చని తదాృహ్యమంటపంబున నునిచి"యో కల భాషిణి! చింతిలఁ గావలదు. ఒకించుక సేపులోన నీ శోకమంతయు బుచ్చివై చెద నాదు పల్కు సిద్ధము, ఇద్దేవి పూజకుఁ బువ్వలు దెచ్చెద"నని పూఁదోఁటకరిగె, అపుడు కడు ముదుసలి యొకతె, కలభాషిణంఁ జేరంజని యిట్లనియె. కట కటా ! యో లతాంగి ! చిలుక, బావురుపిల్లినిఁ జేరినరీతి నీ దురాత్ముఁడగు సిద్దు నెటనుండి చేరితివి?

ఉ. ఎంతయు వింతచెల్వమున నివ్వన మెల్ల నలంకరించుచుం
    గాంతత నొప్ప మేనిపస గన్నులపండువు సేయునిన్ను న
    ల్లంతన చూచి దైవ ముకటా! దొరకించెనె యిట్టి నిర్దయ
   స్వాంతునిచేతి కీ భువనసారము నంచుఁ గడుం గలంగితిన్.

క. ఆ కలుషాత్ముఁడు క్రమ్మఱి
   రాకమునుపె తొలగిపోవ రాదా యెటకే
   నోకూన; యీ మనోజ్ఞత
   రాకృతి యేఁజూడ జోరీ నసిపాల్గాఁగన్.

గీ. అమ్మ! వినుమింక నొకయించుకంత తడవు
    నీ తెరువుఁజూడ నీ పేరు నీ తెఱంగు
   నడిగి పరికింప వది యున్న దైనవాఁడు
   రాకమును నీవు తొలఁగుట నాకుఁ బ్రియము
శా.నీ కెంతే నితఁడాప్తుఁడో జనకుఁడో నెయ్యంపుఁ దోఁబుట్టవో
   నీ కార్యార్థమె పూని తానెచటికేనిం గొంచుఁబోచున్నవాఁ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/60&oldid=153019" నుండి వెలికితీశారు