పుట:Leakalu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిష్టాగరిష్తులై తపంబొనరించు వారలకు మాసాష్టకంబునఁ గార్య సిద్ధియగు. ఆ కారణంబున మణికంధరుని తీవ్రతపంబునకింద్రుండు వెఱచి, యూతనికిఁ దపోభంగం బాచరింప రoభను బనిచి యున్నవాఁడ"నుటయు, కల భాషిణి యాచిల్క వచోవిలాస మున కత్యంతంబు రంజిల్లి మరిమరి వాని వినుతించె.

క. ఆంతట సిద్ధుం డా సీమంతిని నీక్షించి “యేను మది రేక్షణ మీ
    చెంతకు వచ్చుట చెవులకు వింతచెలువ గులుకపాట వినుటకెసుప్తూ,
క. కావున విపంచిఁగైకొని నీవించుకగానపటిమ నెఱఁపగవలయున్
    నావుడు "నటులకాక"ని యావిద్యం బ్రౌద్దుపుచ్చెనతనికి మిగులన్.
    గానావసానcబున నాచం చలాక్షి సిద్ధు నభివీక్షించి,
గీ. “అమరమతి పంపనను వచ్చినట్టిరంభ
    కతన నే మయ్యెనో మణికంధరుని త
    పం బిపుడు మీర లటు దృష్టి పఱపి చూడుఁ
    డనిన నొకకొంత తడ వత డట్ల చేసి
క. నగుచు "నిఁక నేమి తపమో
    మగువ! సలుపుచున్న వాఁడు మణికంధరుఁడా
    మృగలోచనతో నడె యొక
    చిగురుం బొందరింటిలోనఁ జిత్తజలీలల్.

అనిన విని కలభాషిణి యమ్మణి స్తంభునిబోధమహిమకు వెఱఁగoదుచు ననేక ప్రకారంబుల బ్రశంసించి "యో మహాత్మ! యొకటి రె0డుపూఁటలు మూయింట నిలిచి మేము సేయు పరిచర్య గైకొనవలయు" ననిన న తండు "గానలోభంబున నీభవనంబునకు వచ్చు టింతియ కాని, ములటి వీరు వారునుంబలెఁ బట్లనంబుల నెట్లుకొని యిటునటు మహి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/56&oldid=153015" నుండి వెలికితీశారు