పుట:Leakalu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భావించుచు నొకరీతిం
ద్రోవఁ గనుచు నేఁగె నారదుండు నిజేచ్చన్,

మణికంధరుండును దచ్చరితంబులకు నతివిస్మయ ప్రమోద హృదయుండగుచు నితం డింతధన్యతామహిమంబున నొప్పనే యని కొనియూడుచుం దనదృష్టి మార్గంబు గడచు నందాఁక వీక్షించి యెట్టకేలకు నాలోకనంబులం ద్రిప్పకొనియెను. ఇవ్వి ధంబున గురుం డరిగిన నతండుఁ దదుక్త ప్రకారంబునఁ బుణ్య కర్మంబులు నడపుచుఁ గ్రమంబున విష్ణుభక్తి హృదయంబునం బొదలఁ దీర్థయాత్రలు గావించి యనంతశయనంబునకుఁ బడమటిదిళ దళకళికాపుష్పఫలాధిశోభితంబగు వనవాటిని నగారిని గూర్చి తప మొనర్చ దొరఁకొని యున్న వాడు. దానఁజేసి యోతోయజముఖి; యూసరసుని గానకళామాధురి యేమియు ననుభవింప నాకు దొరకదయ్యె"

ఇట్లు పలికి సిద్ధుండా దిక్కునకు విలోకనములు నిగుడించి "యదే నిగాఢపుఁబద్మాసమునఁ గూర్చున్నాఁ డ"నుటయు, నపుడు నికటావనిజంబున నున్న చిల్కయొక్కండు మనుష్య వాక్కున నిట్లనియె “నా నివాసంబు నందనవనంబు,వనజాకుఁ డిచటకు మును పారిజాతంబు దెచ్చుచో నందుండు పకు లిచ్చ గలిగి మఱలి పారుచునుండ, మద్భార్య యవ్వేళ బ్రసవార్తయై యున్కిఁ బఱవలేక, "యొబ్లెననగు. నే నిచటన యుండెద’ నని యొక్క తొట్టలో నడఁగియ్ండె, అది కారణమున నే నివ్వీటి కిని, నాకమునకు రాకపోకలొనర్తు. నేడు నాకంబున మణి కంధరుంగూర్చి నే వినిన వార్తఁ దెల్పెద వినుండు. మణికంధరుం డిపుడు తపంబొనరించుచున్న వనం బద్భుతమహిమాన్వితం బందు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/55&oldid=153014" నుండి వెలికితీశారు