పుట:Leakalu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక భాషా సామర్ధ్యాన్ని పరీక్షించి నిర్ణయించేవి ఆ యూ రచయి తల సాఫల్య వైఫల్యాలు కానేకావు.

ఈవిధంగా ఒక వంక వాడుక భాష ప్రాముఖ్యాన్ని గడిస్తూంటే, ఇంకొక వంక గ్రాంధికం, ఆధునిక సులభ వచనరూ పంలో వ్యావహారి కానికి దగ్గర పడుతోంది. వ్యావహారిక సన్ని హిత గ్రాంధిక భాషను రచయితలు ధారాళంగా వాడుకొం టున్నారు. ఇప్పడు దీని ప్రాచుర్యం అధికం. తెలుగు సారస్వత ప్రపంచంలో నేడు అగ్రగణ్యులైన రాయ్ బహద్దర్ కందుకూరి వీరేశలింగము పంతులుగారు పరుషసరళాది హల్లులవల్ల ద్రుత ప్రకృతికాలకు కలిగే సంధికార్యాలను కొన్నిచోట్ల పాటించక మార్గదర్శకులయారు. ప్రామాణిక ప్రయోగాలప్రకారం వ్యాకరణ సూత్రాల ప్రకారం పరామర్శించినట్లయితే ఏ ఆధునికరచ యితా, ఆ కేపణకు గురికాకుండా తప్పించుకోలేడు. వ్యాకరణ విహిత సంధిసూత్రాలను సర్వత్ర పాటించాలనే నియమాలను, పండితులు స్కూళ్ళల్లో సడలించారు. సంప్రదాయ సిద్ధమైన బంధనాలను తెంచుకోవాలనే నైతిక ధోరణి ఈనాడు కన్పిస్తు న్నమాట స్పష్టం. భావప్రకటనకు ప్రాచీన గ్రాంధిక భాష తగిన సాధనం కాదనే గ్రహింపు పదిమందికీ కలిగింది; నూత్న కావ్య భాషను ఏర్పరచుకోవాలనే అప్రయత్నపూర్వక కృషి కొన సాగుతోంది, ఇక నా విచారమల్లా, ఈ ఉద్యమం, యుక్తి యుక్తం కాని మందగతిని సాగుతోందని!

తెలుగు గ్రాంధికం మహాదుర్బలమైన వొక భాషా ప్రక్రియ. సంప్రదాయం దీన్ని వ్యర్ధంగా తెలుగువాళ్ళమీద విధించిందని నామతం. సంకెళ్ళను పేమించేవాళ్లు ఆ గ్రాంధిక భాషను ఆరాధిస్తారుగాక! నాకుమాత్రం నా మాతృభాష,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/43&oldid=153002" నుండి వెలికితీశారు