పుట:Leakalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజుల పోషణా కాదు; పాశ్చాత్య సాహిత్య ప్రభావమూ కాదు ఇందుకు హేతువు ఉత్సాహి అయిన ఎ°కానొక ఆంగ్లేయు శ్రమ; మన వాడుక భాషలో వున్న స్థానిక చరిత్రల సేకరణన ఆయన ప్రోత్సహించాడు. మెకెంజీ సేకరణలు కొన్ని నిస్స దేహంగా సాటిలేనివి. మరికొన్ని స్పష్టతలో ధారాశుద్ధిలో తూగుల నడకలో ఉత్తమ గ్రాంధికరచనలను తలదన్నగe రచనలు; అంతేకాక నాటికాలపు పోకడలను ప్రజా మేధన ప్రతిబింబించే యిట్టివి, తెలుగు సాహిత్యంలో అరుదు. విశు వివిధరీతుల వాడుక భాషలో భారతీయజీవితాన్ని వ్యాఖ్యా నిస్తూ రాయ్ బహద్దర్ కందుకూరి వీరేశలింగము పంతులుగార కొన్ని ప్రహసనాలను రచించారారు; ప్రయోగార్హమైన కొన్ని ఆంగ్లనాటకాలను తెలుగుభాషలోనికి అనువర్తింప చేశారు, తః వని తలంపుగా కుశాగ్రబుద్ధితో వీటిని వొక సంపుటిగా వెలువరించి తెలుగు భాషకు మసకోపకృతి కావించారు. ఈ ప్రథమ సంపుటిలో వారు, తమ ఉత్తమోత్తమ రచనను సంతరించారు అందువల్ల యినా ఎన్నిక వారి ఉత్కృష్ట సమయోచిత జ్ఞానాన్ని యినుమడింప చేస్తున్నది; దేశం దద్దరిల్లి పోయేటట్లు తుపాన రేకెత్తించినదల్లా నిజానికి వారి రచనలల్లో ఇది ఒక్కటే సంస్కృత నాటక లకణానుసారం, తెలుగు నాటకంలో మొట్ట మొదట గ్రామ్యభాషను ప్రయోగించిన గౌరవం, నా మిత్రుల వేదం వెంకటరాయ శాస్త్రీగారికి తక్కింది; ఆయన ప్రతా: రుద్రీయం నాటకంలోని పాత్రోచిత మాండలిక సంభాషణల మిక్కిలి మధురమైనవి. అయితే కొండంత ఆళతో వాడుక భాషలో రచితమయిన ప్రప్రథమ నాటకం నాదేనని నా నమ్మకం; అది ఎంతమాత్రం విఫలం కాలేదు; కాని వొకమాట

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/42&oldid=153001" నుండి వెలికితీశారు