పుట:Leakalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నామెతో పూవిల్లు సయ్యాటలకు వలయు సంధానముమర్చు కొనెను. ఈ చూపుకు వేయి వరాలిచ్చినా ఋణము తీరదు. వెంకటేశ్వరుల మొగము స్ఫోటక విలుంఠనముతో కొంత గొగ్గురు వోయినను స్త్రీ పురుషప్రధానపాత్రల ధరించిన యోగ్యుడు, చక్కని మొగము, విశాలమయిన నేత్రములు గొంతు వారని కంఠమాధుర్యము. నాటక విషయాల్లో ఆరితేరిన ప్రతిభ. చాకచక్యాలు కలిగియు, సుందరాంగుడై విల సిల్లియు, చకుముకీ, కరకటశాస్త్రీ మొదలయిన హాస్య ప్రసం గాలలో కడుంగడు నేర్పువహించి యాడగల్గు చున్నాడు, స్థానం నరసింహారావు, కులట వనితా వేషధారణమున నత్యంత మనోహరముగ, నొప్పారు మెలకువతో ప్రవర్తించెను. రామ విలాస సభ వారి మేళము, సర్వవిధములా కూర్పువడి మిక్కిలి తెలివితో ఆలోచనతో శక్తితో నేర్పుతో మంచినాటకా లభిన యింప గలిగిరని విన్నవించు *

నాట్యకళా వైదుష్య సంకీర్తనోత్సాహుడు
భగవత్పాద సేవకుడు,
పురాణం సూరి శాస్త్రీ.


  • ఇది సుప్రసిద్ధ విమర్శకులు పురాణం సూరిశాస్త్రిగారు 1924 వ సంవత్సర ప్రాంతంలో కన్యాశుల్క నాటకప్రదర్శనపై వ్రాసిన విమర్శ. నాట్య ఆశోకము అనే వారి గ్రంథములో యిది ముద్రితం.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/37&oldid=152996" నుండి వెలికితీశారు