పుట:Leakalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని పితృవాత్సల్యసూచకమగు సౌదార్యముతో వెంకటేశ మును పలుకరించుపట్టుకూడ విచిత్ర స్వాభావిక రామణీయక మొదవియుండెను. ఆ వెనుక నొంటరిగా బుచ్చమ్మను తలచి నీదు మోమబైటటా మూనులైటు లైటుటా టాటాటా అని మున్నగు మోహావేశప్రబోధిశాశుకవితా వ్యాపార మందు వలపుల నారబోయి పట్టులతి విచిత్రముగనుండెను. పాలిటెక్సు దెబ్బల వుపదేశించాలిసినపుడెల్ల గిరీశము యొక్క సర్వజ్ఞత్వాన్ని, వెంకటేశానికి నిజమైన యెడ్యుకేషను ప్రసా దించవలెననెడి వ్యాజాభిలాషను అభినయవ్యాఖ్యానంలో గిరీశం సంప్రదాయాలు లెస్సగా బయట పడ్డవనే చెప్పవచ్చును.

తంగిరాల ఆంజనేయులు బహు సమర్ధుడైన నటుడు. ఖుస్రూవేషంలో మహమ్మదీయ రాజకుమారుల సారాయి భంగు నిషాలను ముద్రించి నట్లగుపరచెను. రామప్పపంతులు భూమి కలో దరిలేని పంతులు తరహాలనన్నిటిని వెళ్ళబోసెను. రామప్ప పంతులు గుణాలు యెట్లాంటివో పైన విన్నవించుకొన్నాను. ఆంజనేయులు యీ వేషాని కొసంగిన నాట్య విలాసము చూస్తేనే మాచదువరులు తెలుసుకోగలరు. కాని మాటలయల్లి కతో విప్పి చూపలేము. ఇక కరకటశాస్త్రీ నత్తివాగుడుతో, దయ్యాల పోతువలె, మంత్రోపాసివలె, నరుడెంచి పులిపాక వెంకటేశ్వర్లు చూపిన తెలివికి మేర యేలేదు. తమ శిష్యుడికి పడుచుపిల్లల వేష మతికించి రామప్పపంతులు సహాయాన లుబ్దా వధానులకు అంటకట్ట దెచ్చి బేరములాడు తరుణములో, మధుర వాణి, నిజవృత్తాంత మెరింగి, కన్నియ మగతనము గు_ర్తించి, యచ్చెరు వంది జూడ, నొక్కచూపులో వెంకటేశ్వర్లు ఆమెను వారించి సద్దుపరచి యామెతో పాలు కుదుర్చుకొని పైగా

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/36&oldid=152995" నుండి వెలికితీశారు