పుట:Leakalu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీరు ప్రేమికులు. మీరు ప్రేమించడం ఎరుగుదురు. మీ నాటకంలో కొన్నిచోట్ల షాక్ లు వున్నా అవి చురకలు మాత్రమే. నాటకమంతటా విద్యుచ్ఛక్తి ప్రసరించినా, ఎన్నో వింతవింత మెరుపులు మెరిసినా, అందులోని విద్యుత్ప్రవాహం, నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. ఎంత వెలుతురు నింపినా అది తరగదు, చెదరదు !

లైబ్రరీ
24-11-12

నమస్కారములు. ఉభయకుశలోపరి *

నిన్న నార్తరన్ సర్కార్సు ప్రొగెసీవుయూనియన్ మీటింగు జరినది. మీ కన్యాశుల్కంలోని గిరీశంనుగూర్చిన కొంతభాగం ఆడినారు. పొట్ట చెక్కలగునట్లు నవ్వనివారు లేరు. అద్భుతముగా నున్నది. నేను పద్యములు వ్రాసితిని, శ్రీ సుబ్బారావుపంతులుగా రచ్చు వేయించినారు. చాలామంది సంతోషించినారు.

నేను గ్రామ్యంగూర్చి వీరేశలింగంగారి యాజమాన్య మన పచ్చయప్ప కాలేజిలో మీటింగు. ఇవి విశేషములు. తప్పక వెంటనే తెలుగు రాయల శాసనము, సింహాద్రిమీద యింకా రెడ్లశాసనాలు, నా ప్రతాపరుద్రుని శాసనము, దశకుమార చరిత్రము, ముఖ్యముగా ప్రసంగ రత్నావళి పంపఁగోరుచున్నాను. ఎదురుసూచుచున్నాను. జవాబు వ్రాయింపుడు. దొరకునేని, వెదురువిత్తులు పంపవేడెదను.


  • శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మహాకవికి వ్రాసిన లేఖ.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/27&oldid=152987" నుండి వెలికితీశారు