పుట:Leakalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతాపరుద్రీయము నాటకం మీద మీ విమర్శ నేను అవగతం చేసుకున్నాను మీరు వ్రాసిన ప్రత్యక్షరం నిజమని ఆమోదిస్తున్నాను. శ్రీశాస్త్రిగారి 'ఉషా'నాగానందము' నాటకాలను నేను పాఠ్యగ్రంథాలుగా చదివాను. కథానిర్మాణంలో అవి కొంత కుంటుపడినట్లు కనిపించింది. వీరేశలింగముగారి 'హరిశ్చంద్ర', చిలకమర్తి 'పారిజాతపహరణము', 'ప్రసన్నయాదవము'లను కూడా పాఠ్యగ్రంథాలుగా పఠించాను. మీరు చెప్పిన ప్రకారం వీటిమీద మీ సంకీప్త సమీక్షలను పంపినట్లయితే నేనెంతో కృతజ్ఞుణ్ణి.

ఈ ప్రాంతంలో వాడుకలో లేని, మీ నాటకంలో ప్రయుక్తమైన పదములను పట్టికగా తయారుచేసి మీకు త్వరలోనే పంపిస్తాను. కన్యాశుల్కము మొదటి 128 పేజీలు మాత్రం నాకు అందాయి. ఇప్పటికి అచ్చయిన మటుకు ఆ నాటకాన్ని నాకు పంపమని ముద్రాపకులకు వ్రాయండి.

  • * *
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/24&oldid=193009" నుండి వెలికితీశారు