పుట:Leakalu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కునే దీక్షగల యువతి. తన చెడునడతను మార్చుకుని మంచి మార్గానికి రానొప్పని మూర్ఖచిత్త, సన్న సన్నని రేఖలతో రానురాను చక్కని ఆవరణలో వొప్పినపాత్ర రామప్ప పంతులు. విజయనగరంలో అలాంటి కొందరి వ్యక్తులను మనం ఎరగకపోము. అతను మద్యపాన నిరతుడుగా వుండతగినవ్యక్తి. అయితే అట్టి పరిపూర్ణత అవసరం లేకుండానే నాటకంలో అతని పాత్ర బాగుంది.

భారతదేశంలో లజ్ఞాకరమైన వ్యభిచారమే వృత్తిగాగల వనితలకు మధురవాణి పాత్ర మాతృకగా చిత్రితమైనట్లు అనిపిస్తున్నది. వ్యభిచారగృహాలలో తగుమనుష్యులు పడతగిన అగచాట్టు, దురవస్థలు నాటకంలో అద్భుతంగా ఊహింపబడ్డాయి. విటుడనేవాడు సంఘంలో తనకున్న మర్యాదను ఆత్మ గౌరవాన్ని పూర్తిగా పోగొట్టుకుందుకు సంసిద్ధుడు కావలసి వుంటుందని ఈ నాటకం మనకు చక్కగా బోధపరుస్తుంది. పెళ్ళియీడు వచ్చిన వెంకటేశం కేవలం మందమతి; లోకజ్ఞాన శూన్యుడు. కనక తనకు చదువుచెప్పే గిరీశం చేష్టల నడతల నిజ స్వభావాన్ని అతను పోల్చుకోలేకపోతున్నాడు.

నాటకంలో ప్రతీది స్వభావసిద్ధంగా ప్రత్యత పరిస్థితులకు సాక్షీభూతంగా వాస్తవికంగావుంది; ఎడతెరిపిలేని ఎదురు దెబ్బ లతో సునిశితహస్యచమత్కృతులతో ఈనాటకం మనల్ని పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్విస్తుంది నాటకప్రధాన ఆంతరకథాగమనా నికి, సన్నివేశాలు దోహదపడుతూ క్రమక్రమంగా వస్తునిర్మా ణాన్ని పెంపొందిస్తున్నాయి. నాటక నిర్మితిలో పెక్కడా బిగి సడల లేదు సందర్భానుసారంగా పరిస్థితుల కనుగుణంగా పాతలు పరిపోషితమౌతూవచ్చాయి.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/23&oldid=152985" నుండి వెలికితీశారు