పుట:Leakalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వొక కారణం. రచయితల కోవలోనికి చేరాలని ఆనాడు నేను కాంక్షించకపోవడం రెండవ కారణం, పాండిత్యాన్ని పెంపొందించుకుంటూ యితరుల కావ్యాలను చదివి ఆనందిస్తూ సంతృప్తి పడేవాడిని, వొక ప్రయోజనాన్ని కాంక్షించి ఒక మార్గాన్ని నిర్దేశించడంకోసం నేను కన్యాశుల్కాన్ని వెలువరించాను. రచయితలు ముఖ్యంగా నాటకకర్తలు తప్పదారులుబట్టి పట్టాలు తప్పి సాహిత్యకృషి సల్పుతున్నారని నేను గమనించాను. తెలుగున కావ్యభాష యెలాగున నుండవలెనో దానిని యే విధంగా సంస్కరించవలసి వుంటుందో యీ విషయమై నా అభిప్రాయాలు ఏమిటో మీకు తెలుసును. దీనినిగురించి నా నాటక ఉపోద్ఘాతంలో క్లుప్తంగా ముచ్చటించాను. నిత్యజీవిత కార్యకలాపాలలో గ్రాంధికభాషను వ్యవహరిస్తే ఎంత కృత్రి మంగా వుంటుందో దానిని రంగభూమియందు ప్రయోగించినా అంత కృత్రిమంగానూ వుంటుంది.

పుష్కలమైన అనంతమైన సంఘటనలతో నిండివున్న ఎంతో గాంభీర్యమూ వైవిధ్యమూ గల నేటి జీవితాన్ని వీడిం చక ప్రపంచప్రసిద్ధికెక్కిన ప్రాచీనకాల్పనిక కధలనుంచి రచ యితలు యితివృత్తాలను ఎందుకు స్వీకరిస్తారో అర్ధంకాక నాకు ఆశ్చర్యం వేసింది. ఈ కారణాలవల్ల నేను వాస్తవిక జీవితం నుంచి సమకాలికయితివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుకభాషలో నాటకంగా రూపొందించాను.

నే నాశించిన దానికంటె అధికంగా నా నాటకానికి విజయం సిద్ధించింది. అంతటితోనే ననుకున్న ప్రయోజనం నెరవేరింది. నేను పండితుణ్ణి అయితే అందువల్లనే నేను కవిని అయానని దాని భావం కాదు. ఏకుర్రవాడైనా పాండిత్యాన్ని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/17&oldid=152980" నుండి వెలికితీశారు