పుట:Leakalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా నాటకానికింతటి విజయం చేకూరినప్పటికీ మళ్ళీ దానిని ముద్రించాలనికాని లేదా కొత్తవి రచించి అచ్చు వేయించాలనికాని అప్పట్లో నేను అనుకోలేదు. అందుకు కార ణాలు రెండు. తెలుగున గ్రంథప్రచురణమనేది పీకులాట పంచాంగం. కృత్యాద్యవస్థ యూరపులోనో లేదా కనీసం బెంగాలులోనో వున్నట్లు తెలుగు దేశంలో పుస్తక వ్యాపార మనేదిలేదు. గ్రంధకర్త తనపుస్తకాన్ని తానే అచ్చొత్తించు కోవాలి. ముద్రాపకుడు ప్రకటనకర్త ప్రచురణకర్త అన్నీ అతనే! అచ్చొత్తించిన పుస్తకాన్ని అభివందనలతో బహూ కరించమని పరిచయస్థులైన మర్యాదస్థులు గ్రంథకర్తను అర్థిస్తారు; దీనితో గ్రంధకర్త లాభం గూబల్లోకి వస్తుంది. అతని పని కుదేలు!

దేనికైనా మదరాసు ప్రచురణకర్తలు అచ్చువేసే అవ కాశమంటూ వుంచే దిక్కుమాలిన మదరాసు తెలుగులో రాసిన స్కూలుపుస్తకాలకు మాత్రమే ఆ అదృష్టం పడుతుంది. ప్రాచీన కావ్యాల విషయంలో గ్రంధవిక్రేతల మధ్య వస్తుమారకపు వ్యాపారవిధానం కొనసాగుతూవుంది. మొత్తం చెన్నపట్నం పేరు చెప్పి వొక్క మంచి ఆంధ్రగ్రంథవిక్రయశాల వుంటే వొట్టు ! ఇపుడున్న చోటునుంచి ముప్ఫై మైళ్ళ ఉత్తరాన మదరాసు వెలసివుండేనా తెలుగు భాష బతుకు యింతకంటే బాగుండేది. ముప్ఫై మైళ్ళ దక్షిణాన వెలసివుండెనా తమిళ భాష బతుకు అంతకంటె బాగుండేది. ప్రస్తుతంవున్న మదరాసు తెలుగుభాషకు సవతితల్లి,

అప్పట్లో నా నాటకాన్ని పునర్ముద్రించకపోవడానికి కొత్తవి రాసి ప్రచురించక పోవడానికి మీద చెప్పిన పరిస్థితి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/16&oldid=152979" నుండి వెలికితీశారు