పుట:Leakalu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 సెప్టెంబరు 1908

ప్రియమైన మహారాజాసాహేబ్,*

దయతో మీరు పంపిన ఆహ్వానం అందింది. అందుకు నా ధన్యవాదాలు. మీ కోరికలు నాకు ఆజ్ఞ లే, కాని జరూరు పనులవల్ల యిక్కడ వుండిపోవలసివస్తోంది,

  • జగన్నాధవిలాసినీ డ్రమెటిక్ కంపెనీ వంటి ఎన్ని కెన ఎమెచ్యూరు నటసమాజం వారు నా నాటకాన్ని అభినయిస్తున్నారంటే అమితానందభరితుణ్ణయాను. ఇలాంటి ప్రోత్సాహకర పరిస్థితి కారణంగా నా నాటకాన్ని రెండోసారి ముద్రించాలని నిశ్చయించుకున్నారు. ఎన్నడో పన్నెండేళ్ళ క్రితం ప్రతులన్నీ చెల్లిపోయిన నా నాటకాన్ని యీనాటికీ నా మిత్రులు జ్ఞాపకం పెట్టుకున్నారంటే అందులో కొంత

  • విజయరామగజపతిమహారాజావారికి, మహాకవి వ్రాసిన లేఖ.
  • ఆనందగజపతి నెలకొల్పిన నాటక సమాజం: దీనిలో బుచ్చి శాస్త్రి, చొప్పల్లి నరసింహం, కర్రాపాపయ్యశాస్త్రి, పప్పు వెంకటశాస్త్రి, ఆదిభట్ల జగ్గావధానులు ప్రభృతులు సభ్యులు. ఈ సమాజమునకు నాయకుడు బుచ్చిశాస్త్రిగారు; ఈయన నాటకములలో నాయక పాత్రధారి. శ్రీ నరసింహంగారు శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారి జనకులు. వీరు సంస్కృత నాటకములలో నాయిక పాత్రధారి. హరికథా పితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారి సోదరులు శ్రీ జగ్గావ ధానులుగారు. వీరు రాక్షసవేషములను ధరించెడివారు. విదూషక పాత్ర ధారి శ్రీ పాపయ్యశాస్త్రిగారు; మిగిలిన భూమికలను శ్రీఅప్పయ్య శాస్త్రి, వెంకటశాస్త్రిగారలు నటించెడివారు; వీరిద్దరిదీ మధురమైన గాత్రం ఈ సమాజంవారు వేణీసంహారము, అభిజ్ఞాన శోకుంతలము విక్రమోర్వ శీయము, ఉత్తరరామచరితము ఇత్యాదినోటకములను ప్రదర్శించేవారు.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/14&oldid=152978" నుండి వెలికితీశారు