పుట:Leakalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్యాశుల్కము : ప్రదర్శన : ప్రశంస

కన్యాశుల్కం: లుబ్ధావధాన్లు స్థితిని గురించి, గిరీశమును అగ్నిహోత్రావధాన్లు ఆడిగినట్లు చూపవలెను.

               (నీవు) యెన్నాళ్ళు బ్రతికినా యేమి సామ్రాజ్యమే
                       కొన్నాళ్ళకో రామచిలుక అల్ల
                       మూనాళ్ల బతుకుల్కు మురిసేపుత్రుళ్లేవు
                       ముందుగతి గానవె Iచిలుక||
                       కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు
                       కన్నతల్లి ఎవరో చిలుక Iయే!
                       ఇల్లు ఇల్లు అనియెవు ఇల్లు నాదనేవు
                       నీ యిల్లు యెక్కడే చిలుకా
                       పూరికి పుత్తరాన సమాదిపురములో
                       కట్టిల్లు యున్నదే చిలుక Ilయొ||
                       నిన్ను మోసేరు నలుగురు ఎంబడే పదిమంది
                       సమాది పురమందు సాగనంపిరి |చి|
                       నివు కాలిపోయేదాక, కావలుండిరిగాని
                       కడక దొలిగొస్తారు నీయెంట యెవరా రే చి।


  • మల్లయ్య (ద్రాక్షారామం) పాడగా మహాకవి వ్రాసు కున్న పాట. దీనిని సంస్కరించి కన్యాశుల్కము నాటకములో దాసరి వేషంలోవున్న శిష్యుడిచేత పాడించారు.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/12&oldid=152977" నుండి వెలికితీశారు