పుట:Leakalu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీదగ్గర వుందనుకుంటాను. వుంటే కన్యాశుల్కంతో పాటు వాటినీ విమర్శించు.

“అబ్బెబ్బే ! ఈ మనిషికి కావ్యభాషంటే కలం ఆడదు; అందుకే వాడుక భాషలో కన్యాశుల్కం వ్రాశాడు. నోటికందని ద్రాక్షపళ్లు పులుపురొడ్డు అని ఛాందసుగ్రాంథిక వాదులు అనకుండా నీలగిరిపాటల్ని నీ సమీక్షలో ప్రస్తావించు. నీ సమీక్షలో నాకుపంపు. బహుశా దాన్ని హిందూసుందరి పత్రికకు పంపిస్తాను.

అబ్బ ! తూర్పు కోస్తాప్రాంతం ఎంత ఉపద్రవానికి గుర యింది ! మీజిల్లా ఎక్కువ నష్టానికి లోనయిందనుకుంటాను. మూడు రైలు పెట్టెలు సర్వనాశన మయాయని విన్నాను. అయితే చనిపోయినది ముగ్గురేనా ?

పాపం రంగయ్యచెట్టి పోయినాడు, మంచిమనిషి. అతని పద్ధతులు అతనివీ; వాటిప్రకారం యోగ్యుడే. నా పీఠికలో అతన్ని దూయబట్టుకున్నాను. అతని మరణంవల్ల బోర్డాఫ్ స్టడీస్" లో ఖాళీ యేర్పడింది. 'ఒ' అంటే 'న' రాని వ్యక్తిని సభ్యునిగా నియమించవద్దని శ్రీకృష్ణస్వామయ్యరుతో చెప్పాను. అతని స్థానంలో శ్రీరామానుజాచారిగారిని * నియమించమని సూచించాను.


  • కీ.శ. కిళాంబి రామానుజాచార్యులుగారు సంస్కృత ఆంగ్లభాష లలో పండితులు. పశ్చిమ గోదావరిజిల్లా పెంటపాడు వీరి స్వస్థలం. శతా వధాని. స్వయంప్రతిభచే విద్యాసముపార్టనముచేసి రాణించినవారు, ఎమ్, ఏ; బ్రి. యల్; కొంతకాలు హైకోర్టులో ప్రాక్టీసు చేశారు, శ్రీ చంద్రశేఖరశాస్త్రిగారి అనంతరం విజయనగరం ఆంగ్లకళాశాలకు ప్రిన్సిపాలయినారు, క్రమశిక్షణతో విద్యాసంస్థలను నిర్వహించి అభివృద్ధి
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/101&oldid=153050" నుండి వెలికితీశారు