పుట:Lanka-Vijayamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

లంకావిజయము


త్తురు తజ్జనకుఁడు సెప్పిన
సరణిన్ మెలఁగంగ నొకఁడుఁ జాలఁ డనయము.

56


రాఘవ.

ధరణివరులు = రాజులు, ఎందఱేనియున్ = ఎందఱైనను (అనేకులు), అరుదుగన్ = ఆశ్చర్యముగ, తత్కన్యన్ = సీతను, పెండ్లియాడుటకై వత్తురు. తజ్జనకుఁడు = సీతతండ్రి, చెప్పినసరణిన్ = చెప్పినచొప్పున, మెలగంగ వర్తించుటకు (వి ల్లెక్కుపెట్టుటకు), అనయముగా, ఒకఁడుఁ జాలఁడు = ఒక్కఁడును దగినవాడు కాఁడయ్యెను. (సమర్థుఁడు లేఁడు.)


తా.

ఎంతమంది రాజులో వత్తురుగాని వి ల్లెక్కుపెట్టుట యొక్కనికిని సాధ్యముగా దయ్యెను.


లక్ష్మణ.

ధరణిన్ =భూమియందు, వరులు = పెండ్లికొడుకులు, ఎందఱేనియున్ =ఎంతమందియో, అరుదుగఁ దక్కన్యఁ బెండ్లియాడుటకై, వత్తురు. కాని, తజ్జనకుడు సెప్పినసరణిన్ మెలఁగంగన్, ఒకఁడున్, చాలఁ డనయమున్.


తా.

ఎంతమంది పెండ్లికొడుకులైన వచ్చెదరు గాని యాకన్యతండ్రి చెప్పినట్లు, వేదమార్గప్రవర్తకుఁ డొకఁడును లేకపోయెను.


వ.

అట్లప్రాప్తమనోరథుండై యుండఁ గొంతకాలం బరిగె నంత
నొక్కనాఁడు.

57


రెంటికి స్పష్టము.


క.

అతనికి నభిరతిఁ దోఁచెన్
జతయై యొప్పారు మీసుసంతతితో నం
చితసంబంధము గలుగఁగు
రుత రా గాధేయమౌని రూఢాత్మధృతిన్.

58


రాఘవ.

అతనికిన్ = ఆజనకమహారాజునకు, అభిరతిన్ = ఆసక్తిచేత, జతయై యొప్పారు మీనుసంతతితోన్ = జంటలై యున్న మీపుత్రులతో, అంచితసంబంధము గలుగన్ = ఒప్పుచుండెడు సహవాసము గలుగుటకు, గురుతరా =