పుట:Lanka-Vijayamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

51


క.

తాలిమి సద్విద్యలు గడు
మేలగుగుణములును గలిగి మెలఁగెడునగ్గో
పాలాంశభవుల యినకుల
పాలకు లనువాంఛఁ జూచి ప్రజ లెంచి రొగిన్.

49


రాఘవ.

తాలిమి = ఓర్పు, సద్విద్యలు = మంచినిద్యలు, కడుమేలగు గుణములును = శ్లో. “కార్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధేచా ప్యపలాయనం, దాన మీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం" అనునట్టి మేలిగుణములను, కలిగి మెలఁగెడు, అగ్గోపాలాంశభవుల = ఆవిష్ణువునంశమున జనించినవారల, ఇనకులపాలకులు = సూర్యకులపాలకులు, అనువాంఛన్ = అనునట్టికాంక్షతో, చూచి, ప్రజ లెంచిరి, (ఒగిన్.)


తా.

శాంత్యాదిగుణములు, విద్యలు, గలిగిన నారాయణాంశసంభూతులైన యాసూర్యవంశపురాజపుత్రులను జనులు పొగడిరి.


లక్ష్మణ.

తాలిమి, సద్విద్యలు, కడుమేలగుగుణములును గలిగి మెలఁగెడు, అగ్గోపాలాంశభవులన = ఆగోపాలమంత్రి యొక్క యంశమున సంభవులైనవారిని, కులపాలకులను = కులము నుద్ధరించువారిని, ప్రజలు, వాంఛన్ = కోరికతో, చూచి, ఒగిన్, ఎంచిరి.


తా.

సద్గుణములు సద్విద్యలుగల గోపాలమంత్రి పుత్రులను జనులు వంశవర్ధను లని యెంచిరి.


వ.

తదనంతరంబ.

50


సీ.

స్థిరపరభాద్రికౌశికుఁ డయ్యజనరక్ష
        కై నియోగింపఁ దదగ్రసూతి
సుందరమణి సుబాహం దక్కుఁగలవారి
        నిజవిద్యఁ దగుశిక్ష నెరయఁ జేసి