పుట:Lanka-Vijayamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

49


తా.

రాముఁడను గోపాలుని నాల్గవకుమారుఁడు న్యాయాన్యాయవిచారణదక్షుఁడై యెల్లవారికి ముద్దుగ నెగడెననుట.


ఉ.

అవ్విధిఁ బుత్రవంతుఁ డగు చయ్య మహీపతియాజ్ఞ నెల్లెడన్
నెవ్వఁగ లెల్ల వీడఁగను నేర్పుమెయిన్ బురి నెల్లవేడుకల్
నివ్వటిలన్ బ్రజాతతి వినీతిని రక్షణ మొందఁజేయు చి
ట్లవ్వనజాయదాక్షునికటాక్షమునన్ ధృతిబల్మి నొప్పుచున్.

45


రాఘవ.

అవ్విధిన్ = ఆప్రకారమున, పుత్రవంతుఁడు = పుత్రసంతానముంబొందిన, అయ్య = తండ్రియైన, మహీపతి = దశరథుఁడు, ఆజ్ఞన్ = తనయానతిచే, ఎల్లెడన్ = అన్నితావులను, ఎల్ల నెవ్వగలు = దుఃఖములన్నియు, వీడఁగన్ = పోవునట్లు, నేర్పుమెయిన్ = నైపుణ్యమున, పురిన్ = అయోధ్యలో, ఎల్లవేడుకల్ = సమస్తవినోదములు, నివ్వటిలన్ = జరుగఁగా, వినీతిని = న్యాయమార్గమున, ప్రజాతతిన్ = జనసముదాయమును, రక్షణ మొందఁజేయుచు = కాపాడుచు, ఇట్లు, అవ్వనజాయతాక్షుని కటాక్షమునన్ = నారాయణునిదయవలన, ధృతిన్ = ధైర్యమున, బల్మిన్ = బలమున, ఒప్పుచున్.


తా.

సులభము.


లక్ష్మణ.

అవ్విధిన్, పుత్రవంతుఁ డగుచున్, అయ్య = జనకుఁ డైనగోపాలమంత్రి, మహీపతియాజ్ఞ = మహీపతిరావుగారియాజ్ఞచే, ఎల్లెడన్, నెవ్వగలెల్ల వీడఁగను, పురిన్ = కుయ్యేరను గ్రామమందు, ప్రజాతతిన్ = జనులను, రక్షణ మొందఁజేయుచు, అవ్వనజాయతాక్షుని కటాక్షమునన్, ఒప్పుచున్.


తా.

గోపాలమంత్రి మహీపతిరా వనునధికారిక్రిందఁ గుయ్యరుగ్రామమునందలి జనులను నిర్భాధముగ, వేడుకలు పుట్టునట్లు న్యాయమార్గమున నేర్పునఁ బాలించుచుండెను.


క.

తదనంతరంబ సుతులకు
విదితముగాఁగ నుపనయనవిధి గావింపన్