పుట:Lanka-Vijayamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

లంకావిజయము


లక్ష్మణ.

తనకందమ్ములు = తన నేత్రపద్మములు, నెఱయఁగఁ గనుఁగొనన్ = తేఱిచూడఁగా, సిరులీనునట్లు, లక్ష్మణుఁడను కుమారుఁడు, ఘనమతి = మంచిబుద్ధియే, జోడు = కవచము, అగుచునుండన్ = కాఁగా, నిత్యంబున్ = ప్రతిదినము, క్రాలుచునుండున్ = ప్రకాశించుచుండును.


తా.

గోపాలమంత్రి తనయులలోని లక్ష్మణుఁడు (ఈతఁడే యీగ్రంథకర్త లక్ష్మణకవి), తనకు బుద్ధియే కవచముగా వెలుంగుచుండెను.


ఉ.

అన్నలసుందరత్వము సమంచితధర్మవిచక్షణత్వసం
పన్నత హెచ్చగా వెలసె బాలుఁడు రాముఁడు బాహుశక్తి న
త్యున్నతి కెక్కి మిక్కిలి సముజ్జ్వలతం దనతేజ మొప్పఁగాఁ
చిన్నలు పెద్ద లందఱును బెద్దగఁ ద న్గని ముద్దు సేయఁగన్.

44


రాఘవ.

ఆ+నలసుందరత్వము = ప్రసిద్ధమైన నలమహారాజు సౌందర్యమువంటి సౌందర్యమును, ఇక్కడ (ఆ+నల = అన్నల) “ఊష్మరేఫాన్ పరిత్యజ్య ద్విత్వం సర్వహలాం మతం" అనుకారిక వలన ద్విత్వము. సమంచి. .. సంపన్నత - సమంచిత = ఒప్పుచున్న, ధర్మ = ధనుస్సు నుపయోగించుట యొక్క, విచక్షణత్వసంపన్నత = ప్రవీణతయొక్క యతిశయమును, బాహుశక్తి = బాహుబలమున, అత్యున్నతి కెక్కి = మిక్కిలిప్రసిద్ధుఁడై, తనతేజము = తనపరాక్రమము, సముజ్జ్వలతన్ = ప్రకాశమానమై, ఒప్పఁగా, పిన్నలు, పెద్దలు, అందఱును, తన్ను గని, ముద్దు సేయఁగన్, బాలుడు, రాముఁడు, మిక్కిలి, వెలసెను.


తా.

నలునిమించిన రూపమున, ధనుర్విద్యావికాసమున, బాహుశక్తిని, ప్రతాపమునఁ, బిన్న పెద్దలు తన్ను, ముద్దు చేయురీతిని రాముఁడు సర్వోత్కృష్టుఁడై యుండెను.


లక్ష్మణ.

అన్నల = ముగ్గురన్నలయొక్క, సుందరత్వము = సౌందర్యమును, సమందితధర్మవిచక్షణత్వసంపన్నత = ధర్మము నెఱుంగుటయందలి నేర్పును (న్యాయమును దెలిసికొనుట), బాలుడు, రాముఁడు = రాముఁడను నాలుగవపుత్రుఁడు ప్రకాశించెను. తక్కినవి సమానము.