పుట:Lanka-Vijayamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

లంకావిజయము


లక్ష్మణ.

రుచిరతాస్పదము = సౌందర్యస్థానమైనవానిని, దిరుపతినా = తిరుపతిమంత్రియన, భాసితున్, క్షేమ+మాన+యశోభిరామున్, జ్యేష్ఠుని, కీర్తిజితరూప్యగిరిన్, శుభరతునిన్ = శుభాసక్తుని, రామకృష్ణునిన్ = ఆపేరుగలవానిని, లక్ష్మణునిన్ = లక్ష్మణనామముగలవానిని, సుమిత్రానందను = మంచిస్నేహితుల కానందము గల్గించువానిని, రూఢిగా = నిర్ణయముగ, రామున్ = ఈపేరిటివానిని, ప్రబలుమని, శత్రుఘ్నుని = శత్రునాశకుని, తద్గురుండు = వారితండ్రి గోపాలమం త్రి, దీవించి పలికెను.


తా.

గోపాలమంత్రి, తిరుపతిని, రామకృష్ణుని, లక్ష్మణుని, రాముని (తననలువురు కొడుకులను), దీవించెను.


వ.

అంత.

40


ఉ.

తాతను గన్నతండ్రి నుచితస్థితిఁ బోలిన పెద్దచిన్నవాఁ
డాతతబుద్ధిశాలి యగు చాత్మమునందలపోయ బాల్యమం
దే తెలివిన్ ఘనుం డగుట నెంతయు విస్మయ మొప్పసజ్జన
వ్రాతముఁ బ్రోవ దుష్టజనవర్గము చేవయడంపఁ బెంపునన్.

41


రాఘవ.

తాతను = బ్రహ్మను, కన్నతండ్రిన్ = కనినతండ్రియైన విష్ణుదేవుని, ఉచితస్థితిన్ = తగినరీతిని, పోలిన = అనుకరించిన, పెద్దచిన్నవాఁడు (రాముడు), ఆతతబుద్ధిశాలియగుచు = విస్తారమైన జ్ఞానవంతుఁడై, ఆత్మమునందలపోయ = మనస్సున నాలోచింపగా, బాల్యమందే = చిన్నప్పుడే, తెలివిన్, ఘనుండగుటన్, ఎంతయున్ = మిక్కిలి, విస్మయ మొప్పు= ఆశ్చర్యకరము గాఁగ, పెంపునన్ = అతిశయముచే, సజ్జనవ్రాతముఁ బ్రోవన్ = శిష్టజనసమూహమును రక్షించుటకున్ను, దుష్టజనవర్గము చేవ = దుర్జనులగర్వమును, అడంపన్ = తగ్గించుటకును.


తా.

విష్ణుమూర్తివలె రాముఁడు చిన్నతనమునందే బుద్ధిశాలియై దుష్టశిక్షణ శిష్టరక్షణములయందు నేర్పరియై జనులకు విస్మయముం బుట్టించె ననుట.


లక్ష్మణ.

తాతను = తాతగారిని, కన్నతండ్రిని = తండ్రి గారిని, ఉచితస్థితిన్ = వారివారిగుణములచేత, పోలిన పెద్దపిన్నవానిని, తక్కినది సులభము.