పుట:Lanka-Vijayamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

45


ణుని సుమిత్రానందనుని సమస్తజనమా
        న్యప్రవర్తనలఁ జెన్నమరు మనియు


గీ.

రూఢిగా రాము బలియు శత్రుఘ్ను నాల
వకొమరుని ఘనవృత్తిని వఱలు మనియు
ధరణిజను లెల్ల మెచ్చ నల్వురను దద్గు
రుండు దీవించి పలికె నిరూపణముగ.

39


రాఘవ.

రుచిర... పతినా - రుచిరతా = సుందరత్వమునకు, ఆస్పద = స్థానమైన, ముదిరు= మేఘునియొక్క, “ఘనజీమూతముదిరజలముగ్ధులనుయోనయః" అమరము. పతినా = ప్రభువైన యింద్రుని వలె, భాసితున్ = ప్రకాశించుచున్నవానిని, పతినా = ప్రతి యనునట్టులు, (ప్రతిశబ్దద్భవము, పతి. దేశ్యమని కొంద ఱందురు.) క్షేమమానయశోభి = శుభసంపత్తి, నీతులచేఁ బ్రకాశించువానిని (క్షేమమా+నయ+శోభి), రామున్ = రాముని, జ్యేష్టున్ = మొదటివానిని, శ్రీలనేలుమనియు = సంపదల నేలుమనియు, రెండవసతున్ = రెండవకొడుకును, కీర్తిజితరూప్యగిరిశున్ - కీర్తి = యశస్సుచే, జిత = జయింపఁబడిన, రూప్య = వెండియు, గిరిశున్ = శివుఁడును గలిగినట్టివానిని , రామకృష్ణున్ = రామునివలె నల్లనికాంతి గలవానిని, భరతుని, మహనీయవృత్తిని విలసిల్లుమనియు, మూఁడవయతనిన్, సుమిత్రానందనుని, లక్ష్మణుని, సమస్తజనమాన్యప్రవర్తనలఁ జెన్నలరుమనియు, నాలవకొమరుని, రూఢి. . . త్రుఘ్ను - రూఢి గారాము = ముద్దుచేత, బలియు = ప్రబలు, శత్రుఘ్నుని, ఘనవృత్తిని వఱలుమనియు, తద్గురుండు = వారిగురువైన వసిష్ఠుఁడు, నిరూపణముగ ధరణిజనులెల్ల మెచ్చ, దీవించి పలికెను.


తా.

మేఘశ్యాముఁ డైన రాముని, రామునిం బోలిన భరతుని, లక్ష్మణుని, శత్రఘ్నుని శ్రీల నేలుమనయు, కీర్తిచే వర్ధిల్లుమనియు, జనమాన్యప్రవర్తనము గలిగియుండు మనియు, ఘనుఁడవై యలరు మనియు గురువైన వసిష్ఠమహర్షి దీవించెను.