పుట:Lanka-Vijayamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

లంకావిజయము


తా.

గోపాలమంత్రి పెద్దకొడు కట్లు దినదినాభివృద్ధి నొందుచుండ బ్రతిసంవత్సరము నొక్కొక్కకుమారునిగా మఱిమువ్వురకు రాజమ్మ సలక్షణములు గలవారిని గనియె, వారిలో పెద్దవాడైన తిరుపతి, తండ్రి కానందము గలిగించుచు గుణవంతుఁ డనిపించుకొనియెను. ఇట్లు నలుగురుపుత్రులు, తిరుపతి, రామకృష్ణ, లక్ష్మణ, రామ నామముగలవారు వర్ధిల్లుచుండిరి.


వ.

అట్లు క్రమక్రమంబున.

37


క.

తారాగ్రహములు తమలోఁ
దారాగ్రహములు వదలియుఁ దద్దయు శుభసం
చారులగు వేళఁ బుట్టిరి
మారసమాకారు లక్కుమారులు ధీరుల్.

38


రాఘవ.

తారాగ్రహములు = నక్షత్రములు, గ్రహములు, తమలోన్, తారు = తమరు, ఆగ్రహములు = విరోధభావములు, వదలి, తద్దయున్ = ఎంతయు, శుభసంచారులగువేళన్, మారసమాకారులు - మా = లక్ష్మిని, ర = గ్రహించిన (విష్ణువుతో), సమాకారులు = సమానమైనయాకారములుగల, అక్కుమారులు = రామాదులు, ధీరుల్, పుట్టిరి.


లక్షణ.

మారసమాకారులు = మన్మథాకారులు, తక్కినది సమానము.


తా.

నక్షత్రములు గ్రహములు మంచిస్థితియందుండఁగా, శుభసంచారములు చేయుచుండఁగా నానల్వు రుదయమందిరి.


సీ.

రుచిరతాస్పదము దిరుపతి నా భాసితు
        క్షేమమానయశోభిరాము జ్యేష్ఠు
శ్రీల నేలుమనియును రెండవసుతుఁ గీర్తి
        జితరూప్యగిరిశు భరతుని రామ
కృష్ణుని మహనీయవృత్తిని విలసిల్లు
        మనియును మూఁడవయతని లక్ష్మ