పుట:Lanka-Vijayamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

43


తల్లులను, మువ్వురన్ = కౌసల్య, కైక, సుమిత్రలను, తండ్రినిన్ = దశరథుని, ముదమందఁ జేయుచున్ (వెనుక కన్వయము); అందు = ఆనలువురుకొడుకులలో, అగ్రజుండు = పెద్దవాఁడు (రాముఁడు), గుణాధికతను = విశేషగుణములచే, పొలిచెన్ = ప్రకాశించెను. ఆరీతి = అట్లు, తత్పుత్రులు నల్వురు = రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, అచ్యుతభుజములయట్లు = విష్ణుదేవుని నాలుగుభుజములవలె, బల్మి = బలమును, వేదములచందమునను = చతుర్వేదములవలె, పవిత్రతలను, కమలసంభవుముఖములగతిన్ = బ్రహ్మదేవుని నాల్గుమోములరీతిని, చదువులన్ = విద్యలను, జలధులపగిదిన్ = నాలుగుసముద్రములయట్లు, గాంభీర్యములను = గంభీరభావనలను, కాంచన్, తగుటలు = తగియుండుటలు, జనంబు వినుతింప, నెగడిరి. అంత.


తా.

రామలక్ష్మణభరతశత్రుఘ్నులు ఓర్పున, కాంతిని, నాఁనాఁటికి, ఏఁటేఁట నొకవింతచెలువము గానుపింప, తల్లిదండ్రుల కానందముం గల్పించుచుండిరి. ఆందుఁ బెద్దవాఁడు గుణాధిక్యమును వహించెను. ఆనలుగురు, విష్ణుదేవుని బాహువులవలె బలిమిని, వేదములవలెఁ బవిత్రతలను, బ్రహ్మముఖమువలె విద్యలచేతను, సముద్రములవలె గాంభీర్యముల జనులు పొగడఁ బెరిఁగిరి.


లక్ష్మణ.

క్షమన్ = భూమియందు, రుచిరాజిన్ = కాంతిపఙ్క్తిగల, సుసంతన = ఆగోపాలుని చక్కనికుమారుఁడు (తిరుపతి మంత్రి). అట్లు, నాఁనాఁటికిన్ = దితిక్రమమున, మెఱయన్ = ప్రకాశించుచుండగా, ఏఁటేఁటన్, ఒకొకకొమరుగాన్ = ఒక్కొక్కకొమారుని చొప్పున, మితలక్షణము లొప్పన్ = శాస్త్ర్రోక్తలక్షణములు కలుగునటుల, కాంచెన్, మాత = తల్లియైన రాజమ్మ, లసత్+సుధాంశుమండలముఖులన్ = వెలుఁగుచున్న చంద్రమండలముల వంటి మోములు గల, మువ్వురన్ =ముగ్గురు కుమారులను, కనియెననుట. తండ్రిన్ = గోపాలమంత్రిని, ముదముందఁ జేయుచు, అందగ్రజుండు = తిరుపతియను పుత్రుఁడు, గుణాధికతను, పొలిచెను. ఆరీతిన్, తత్పుత్రులు నల్వురు = తిరుపతి, రామకృష్ణ, లక్ష్మణ, రామనామములు గలనల్గురు, కాంచఁదగుటలు = పొందఁదగియుండుటలు, జనంబు వినుతింపన్, నెగడిరి = వృద్ధినొందిరి.