పుట:Lanka-Vijayamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

లంకావిజయము


దనిపి సముచితసమయంబునఁ బుణ్యాహవాచనపూర్వకంబు
గా జాతకర్మనామకరణంబులు గావించె నివ్విధంబున.

35


రాఘవ.

అగ్గోపాలుండు = ఆదశరథుఁడు, తత్సంతానంబున్ = ఆనలుగురుపుత్రులను, కాంచి = కని.


లక్షణ.

అగ్గోపాలుండు = ఆగోపాలమంత్రి, తత్సంతానంబు = ఆకుమారుని. తక్కి నది సమము స్పష్టము.


సీ.

క్షమరుచి రాజిసుసంతతి యట్లు నా
        నాఁటికి మెఱయ నేటేఁట నొకొక
కొమరు గామితలక్షణము లొప్పఁగాంచె మా
        తల సత్సుధాంశుమండలముఖులను
మువ్వురఁ దండ్రిని ముదమందఁ జేయుచు
        నందగ్రజుండు గుణాధికతను
బొలిచె నారీతిఁ దత్పుత్రులు నల్వురు
        నచ్యుతభుజములయట్లు బల్మి


గీ.

వేదములచందమునను బవిత్రతలను
గమలసంభవుముఖములగతిఁ జదువుల
జలధులపగిది గాంభీర్యములను గాంచఁ
దగుటలుజనంబు వినుతింప నెగడి రంత.

36


రాఘవ.

క్షమ ... సంతతి - క్షమ = సమర్థమైన, రుచిర = సుందరమైన, అజిసంతతి=దశరథపుత్రులు (అజుఁడను రాజు కొడుకు - అజి = దశరథుఁడు, అజిసంతతి = దశరథుని సంతానము), అట్లు, నానాఁటికిన్, మెఱయన్, ఏఁటేఁటన్ = ప్రతిసంవత్సరము, ఒకొకకొమురు - ఒక్కొక్కతేటను, కామితలక్షణము లొప్పన్ = కోరఁబడిన చిహ్నములు ప్రకాశించునట్లుగా, కాంచెన్, సత్సుధాంశుమండలముఖులన్ = చంద్రబింబములవంటి ముఖములుగల, మాతలన్ =