పుట:Lanka-Vijayamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41


లక్ష్మణ.

కన్నమ్మకు = రాజమ్మకు, ఓసలక్ష్మా = శుభలక్షణసహితుఁడా! వరసుత = జ్యేష్ఠపుత్రుఁడా! ప్రీతినిలన్ = సంతోషస్థితికొఱకు, పురుషోత్తము = ఉత్తముపురుషుఁడా! కలిగితి, అనుచున్, భయదారిని = భయమును బోఁగొట్టువాఁడవు, అయిన, ఈవు = నీవు, గోపాలజుం డౌటన్ = గోపాలమంత్రి పుత్రుఁడ వౌటచే, సుశ్రీకైక - సుశ్రీ = సుసంపత్తిగలవారిలో, ఏక = ముఖ్యుఁడా! వాంఛ = మాకోరికి, రాజిలెన్, అటంచున్, భోగీంద్రున్ = భోగవంతులలో మిన్నవైన, నిన్ను, నేఁడు, ఈగతిఁ గనుటన్ = ఈచొప్పునఁ జూచుటచే, సుమిత్రమోదస్థితి=మంచిమిత్రులసంతోషము, మించె , అనుచున్, పితృకృతసుకృతోన్నతి(యొక్క), వలము = బలము, రిపురుషాకృతిహారివి - రిపు = శత్రువుల, రుషా = కోపముయొక్క, ఆకృతి = ఆకారమును, హారివి = వారించువాఁడవు, (అయిన) నీవు, అయ్యెననుచున్ (తలిదండ్రుల పుణ్యబలమే నీయాకార మయ్యె ననుట), నలి, నియోగులు = స్వశాఖీయులయిన బందుగులు, బుధులు = పండితులు, ఎన్నఁగ = గణించగా, నలు = నలునియెక్క, గురు = గౌరవమైన, రూపమున = ఆకారమున, మీఱి, రమన్ = లక్ష్మిచే, లసద్రుచిన్ = శోభచే, బలమునన్, ఒప్పెను. అయలీలలు = భాగ్యవిలాసములు, అభివృద్ధి నొందన్, ఎసఁగున్, ఆయన = ఆచిన్నవాఁడు, (నాయన = తండ్రియొక్క) ఘనయశోభానియతు లెదుగఁగన్ = సుకీర్తిప్రభానియమవృద్ధికొఱకు, అని, వెనుకక్రియతో నన్వయము.


తా.

రాజమ్మకు నీవు సలక్షణుఁడవు పురుషోత్తముఁడవు కలిగతివి. భయమును బోఁగొట్టువాడవు, ఇంద్రభోగము లనుభవిందు ని న్నీగతి జూచుచున్న స్నేహితులసంతోషము మించుచున్నది. నీతండ్రి చేసిన పుణ్యమే నీవై పుట్టె నని నియోగులు, పండితులు నెన్న, నలరాజు వంటి సౌందర్యముతో గోపాలమంత్రి కుమారుఁ డుండెను.


వ.

అంత నగ్గోపాలుండు తత్సంతానంబుఁ గాంచి పెన్నిధిఁ గన్న
పేదచందంబున సంతసించి పుత్రమహోత్సవం బొనర్చి సమస్త
జనంబు లభినందింప భూసురప్రముఖుల నానావిధంబులం