పుట:Lanka-Vijayamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

39


మాటికి, మంద = మందమైన, అంద్రువిన్యాస = అడుగులు పెట్టునది, యై, ప్రణుతింపంబడుచున్ = స్తుతింపఁబడుచు, హిత....షాప్తిన్ - హిత = ఇష్టమైన, గర్భశ్రీ = గర్భసంపదయొక్క, విశేషాప్తిన్ = అతిశయప్రాప్తిచేత, లక్ష్మణు, శత్రుఘ్నునిన్, పుత్రకుల, సత్సంతోషము = సత్పురుషుల కానందము, ఏపారంగన్ = వృద్ధియగునట్లు, కాంచె = కనియెను.


తా.

అనేకములయిన మనోరథములు గలిగి నల్లనైన స్తనాగ్రములు గలిగి నడక మందగించినసుమిత్ర లక్ష్మణుని శత్రుఘ్నుని గనియెను.


లక్ష్మణ.

శుభ్రాస్యజితాబ్జ = తెల్లనిముఖముచే జయింపఁబడిన చంద్రుఁడు గల, రాజమ= రాజమ్మ, సుమిత్ర ... షాప్తిన్ -సు, మిత్ర, హిత, గర్భశ్రీవిశేషాప్తిన్, లక్ష్మణు = లక్ష్మీవంతుఁడును, శత్రుఘ్నునిన్ = శత్రునాశకుఁడును, అయిన పుత్రకున్ = కొడుకును, లసత్సంతోష మేపారఁగన్, కాంచెన్.


తా.

రాజమ్మ, తన బాంధవులకు స్నేహితులకుఁ బ్రియమగునట్లు గర్భము దాల్చి లక్షణవంతుఁ డైనయొకకొడుకును గనియెను.


వ.

అంత.

33


సీ.

కన్నమ్మ కోసలక్ష్మావరసుత ప్రీతి
        నిలఁ బురుషోత్తమ కలిగి తనుచు
భయదారి వీవు గోపాలజుండౌట సు
        శ్రీకైకవాంఛ రాజిలె నటంచు
భోగీంద్రు నిన్ను నేఁ డీగతిఁ గనుట సు
        మిత్ర మోదస్థితి మించె ననుచుఁ
బితృకృతాతిసుకృతోన్నతి వలమురి పురు
        షాకృతిహారి వీ వయ్య ననుచు


గీ.

నలినియోగులు బుధులు నెన్నఁగ నలుగురు
రూపమున మీఱి రమలసద్రుచిబలమున