పుట:Lanka-Vijayamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

లంకావిజయము


రాఘవ.

శ్రీకేకయనందన = శోభతోఁ గూడిన కైకేయి, భవ్యాకృతిన్ =శుభాకారముగల, భరతసుసమాఖ్య నలరుకొమరున్ = భరతుఁ డను శ్రేష్ఠనామము గలకుమారుని, ముల్లోకములు మెచ్చ, శ్రీకరసుమవల్లి = శోభాయుక్తమైన పువ్వులతీఁగ, తావిరీతిన్ = పరిమళమును వలెనే, ప్రీతిన్ = ప్రేముడిచే, కాంచెను = కనియెను.


తా.

కైక, పువ్వుఁదీఁగె పరిమళమును గాంచినట్లు భరతుఁడను పుత్త్రుని బడసెను.


లక్షణ.

శ్రీకేకయనన్ = సంపత్తికి ముఖ్యమైనవి యనునట్టులు, తనభవ్యాకృతిభరతన్ = తనశుభాకారభరణముచేత, సుసమాఖ్యనలరు కొమరున్ - సుసమాఖ్యనలరు = సుకీర్తిసహితమైన, కొమరున్ = తేటను (సౌందర్యమును), శ్రీకరసుమవల్లితావిరీతిన్, ముల్లోకములు మెచ్చన్, ప్రీతిన్ = ప్రేముడిచే, కాంచెను = పడసెను.


తా.

రాజమ్మ పతిసేవవలన సంపత్తికి ముఖ్యమైన తనశరీరకాంతిచేత నొకవిధమైన సౌందర్యమును వహించెను.


వ.

తదనంతరంబ.

31


స్పష్టము.


మ.

గణనాతీతమనోరథాళి స్వకుచాగ్రత్విడ్జితామర్త్యరా
ణ్మణిశుభ్రాస్యజితాబ్దరాజమముహుర్మందాంఘ్రివిన్యాసయై
ప్రణుతింపంబడుచున్ సుమిత్రహితగర్భశ్రీవిశేషాప్తి ల
క్ష్మణు శత్రుఘ్నునిఁ గాంచెఁ బుత్రకుల సత్సంతోష మేపారఁగన్.

32


రాఘవ.

గణనాతీతమనోరథాళి = లెక్కకు మించిన దౌహృదములు కలిగినట్టియు, స్వకు.... రాణ్మణి - స్వ = తన, కుచాగ్ర = చూచుకములయొక్క, త్విట్ = కాంతిచే, జిత = జయించఁబడిన, అమర్త్యరాణ్మణి = ఇంద్రనీలమణులు కలిగినట్టియు, శుభ్రాస్యజితాబ్దరాజమ - శుభ్ర = తెల్లనైన, ఆస్య = ముఖముచే, జిత = జయింపఁబడిన , అబ్జ = పద్మములయొక్క, రాజ = చంద్రునియొక్క, మ = శోభ కలిగినట్టియు, సుమిత్ర, ముహర్మందాంఘ్రవిన్యాసయై - ముహుః = మాటి