పుట:Lanka-Vijayamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


యనుట) “మహేలామహిళాదిస్యాత్” అని ద్విరూపకోశము. సుశ్రీరాజద్వరపాదభక్తిన్ - సు = యోగ్యమైన, శ్రీ = శోభచే, రాజత్ = ప్రకాశించెడు, పర = భర్తయొక్క, పాదభక్తిన్ = పదభక్తిచేత, శ్రీరామనామున్ = శ్రీరాముఁ డనుపేరుగలవానిని, నుతుల్ నేరంగనియెన్, భార్గవురేణుకాతరుణిపోల్కిన్ = పరశురాముని రేణుక కనినయట్లును, భవ్య . . . జాతున్ - భవ్య = శుభదమైన, నానాతపశ్శ్రీ = నానావిధప్రకాశసంపత్తి కలిగిన, రక్తమరీచిజాతున్ = ఎఱ్ఱనికిరణసముదాయముగలవానిని (సూర్యుని), అదితిస్త్రీలాగునన్, బాగుగన్.


తా.

పెద్దభార్య యైనకౌసల్య పతిపాదభక్తివలన, శ్రీరాముఁ డనుకొమరుని, రేణుక పరశురాము గనినయట్లు అదితి సూర్యుని గనినయట్లు కనియెను.


లక్ష్మణ.

ఆరన్, రాజమ = రాజమ్మయనుస్త్రీ, హేలలందునను = విలాసములందున, పెద్దై = శ్రేష్ఠురాలై , ఒప్పు = తగునట్టి, సత్పుణ్య . . . భక్తిన్ - సత్పుణ్యసుశ్రీ = పుణ్యముయొక్క శ్రేష్ఠమైనశోభచే, రాజద్వరపాదభక్తిన్ = ప్రకాశించు పెనిమిటియొక్క పాదసేవను, మున్ = పూర్వము, శ్రీరామనా = లక్ష్మీకాంతవలె, భార్గవురేణుకాతరుణిపోల్కిన్ = జమదగ్నిని రేణుకవలె, భవ్యనానా... లాగునన్ - భవ్య = శుభకరమైన, నానాతపశ్శ్రీ = నానావిధతపస్సంపత్తియందు, రక్త = అనురక్తమైన, ఆత్మ = బుద్ధిగల, మరీచిజాతున్ = కశ్యపుని, అదితిస్త్రీలాగునన్ = అదితివలె, బాగుగన్, నుతుల్సేరన్, కనియెన్ = పొందెను.


తా.

గోపాలుని భార్య రాజమ్మ, తన పెనిమిటిని, పూర్వము, లక్ష్మీదేవివలె, భృగుమహర్షిని రేణుక వలె, కశ్యపుని అదితివలె సేవించెను.


వ.

మఱియును.

29


అర్థము సమము.


క.

 శ్రీకేకయనందన భ
వ్యాకృతి భరతసుసమాఖ్య నలరుకొమరు ము
ల్లోకములు మెచ్చఁ గాంచెను
శ్రీకరసుమవల్లితావిరీతిం బ్రీతిన్.

30